దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజూ మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. అయితే, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలని డిమాండ్ పెరుగుతున్నది. సర్వేలు కూడా ఇదే విషయాన్నీ స్పష్టం చేస్తున్నాయి. ఈ సమయంలో లాక్ డౌన్ పై రాహుల్ గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాల వలనే దేశంలో కరోనా మహమ్మారి…
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రజా వ్యతిరేక విధానాల వల్లే దేశంలో ఇలాంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న తాను..దేశం నలుమూలల నుంచి బాధకరమైన వార్తలు వింటున్నానని తెలిపారు రాహుల్ గాంధీ. పనికి రాని ఉత్సవాలు, ప్రసంగాలు కాకుండా.. సంక్షోభానికి పరిష్కరాం చూపించాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇప్పటికైనా కేంద్రం తన తీరును మార్చుకోవాలని హెచ్చరించారు.