ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పంజాబ్ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కారణం అని చెప్పవచ్చు. కాగా, ఇప్పుడు ఆయన 2024లో కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక వచ్చే ఏడాది యూపీకి ఎన్నికలు జరగబోతున్నాయి. యూపీలో కాంగ్రెస్ తోపాటుగా సమాజ్ వాదీ పార్టీ కూడా పుంజుకుంటోంది. వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా కాకుండా పోటాపోటీగా జరిగే అవకాశం ఉన్నది. ఇక ఇదిలా ఉంటే,…
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఏఐసీసీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. సమావేశంలో జరిగిన చర్చ, తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మాలను వెల్లడించారు.. ద్రవ్యోల్బణం, రైతాంగ సమస్యలు, రైతులపై జరుగుతున్న దాడులపై, తాజా రాజకీయ పరిస్థితులపై తీర్మానాలు చేసింది సీడబ్ల్యూసీ.. సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ను కూడా ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి…
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమైంది.. 2022 సెప్టెంబర్ నెలలో అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది.. నవంబర్ 1వ తేదీ నుంచి సత్యభత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమై 2022 ఆగస్టు నెలాఖరు వరకు కొనసాగనుంది.. అయితే, ఈ సమావేశంలో తిరిగి ఏఐసీసీ బాధ్యతలు స్వీకరించాలని రాహుల్ గాంధీని కోరారు.. మరోవైపు.. తాను కాంగ్రెస్‌కు తాత్కాలిక అధ్యక్షురాలిగా లేనని.. పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్నానని సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే…
దేశవ్యాప్తంగా లఖింపూర్ ఖేరి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది… కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా కాన్వాయ్‌తో రైతుల ర్యాలీపైకి దూసుకుపోవడంతో నలుగురు రైతులు మృతిచెందగా.. ఆ తర్వాత జరిగిన హింసలో మరో నలుగురు మృతిచెందడం సంచలనంగా మారింది… అయితే, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసేందుకు సిద్ధం అయ్యారు కాంగ్రెస్ నేతులు.. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల ప్రతినిధి బృందం.. రేపు రాష్ట్రపతితో సమావేశం కానుంది.. ఈ సందర్భంగా లఖింపూర్ ఖేరి హింస ఘటనపై వాస్తవాలను…
కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీలు.. గాంధీలంటే కాంగ్రెస్ పార్టీ గుర్తుకొస్తుంది. ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్ చేజారిపోతే ఆపార్టీ బ్రతికి బట్టకట్టదనే ప్రచారం ఉంది. ఈ కారణంతోనే సోనియాగాంధీ ఎంత కష్టమైనా అధ్యక్ష బాధ్యతలను తానే మోస్తున్నారు. ఒక్కసారి అధ్యక్ష పీఠం చేజారితే ఏం జరుగుతుందో సోనియాగాంధీకి తెలుసు. అందుకే ఆమె అధ్యక్ష బాధ్యతలను ఇతరులకు కట్టబెట్టేందుకు సుముఖతను వ్యక్తం చేయడం లేదు. ఇస్తేగిస్తే గాంధీ కుటుంబంలోని వారికేనని…
కాంగ్రెస్‌లో మళ్లీ కలకలం.. హస్తం పార్టీలో అలజడి కొత్త కాదు. కానీ, కొద్ది రోజుల క్రితం కపిల్ సిబల్ చేసిన విమర్శలు కాకరేపుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు ఎవరంటూ ఆయన ప్రశ్నించటమే తాజా సంక్షోభానికి కారణం. నాయకత్వాన్ని ప్రశ్నించటం కార్యకర్తలకు నచ్చలేదు. సిబల్ ఇంటి మీద పడ్డారు. గొడవ గొడవ చేశారు. ఇదంతా కావాలనే చేయించారని సిబాల్ బృందం అంటోంది. దాంతో వారు నాయకత్వంతో తాడో పేడో తేల్చుకుంటారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న పరిణామాల పట్ల…
కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో పాటు, మరో ముగ్గురు లఖింపూర్ ఖేరీని సందర్శించడానికి యూపీ పోలీసులు అనుమతి ఇచ్చారు. మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇతర ప్రతిపక్ష నాయకులను అనుమతించారు పోలీసులు. లఖింపూర్ ఖేరీ వెళ్లేందుకు అనుమతి ని నిరాకరిస్తూ ప్రియాంక గాంధీ ని సోమవారం అరెస్టు చేసారు పోలీసులు. ఈరోజు ఉదయం, రాహుల్ గాంధీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ , పంజాబ్…
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. లఖింపూర్ ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. అటు ప్రతిపక్షాలు సైతం యూపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు రైతుల హక్కుల్ని కాలరాస్తున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. లఖింపూర్ ఘటనలో కేంద్రమంత్రి కొడుకును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. నిన్న యూపీ వెళ్లిన ప్రధాని లఖింపూర్ వెళ్లి బాధితులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. తాము లఖింపూర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని, 144 సెక్షన్…
త్వరలోనే విశాఖ,గుంటూరుకు రాహుల్ గాంధీ రానున్నారు అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు చింతా మోహన్ తెలిపారు. అమరావతి,విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతుగా పర్యటన చేయనున్నారు రాహుల్ గాంధీ. అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ కొరత ఉంది.. సిద్దాంతపరంగా బలంగా ఉన్నప్పటికీ ప్రజా ఆమోదయోగ్యమైన నాయకత్వం లేదు. అటువంటి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నాం అని చింతా మోహన్ తెలిపారు. త్వరలో పీసీసీలో మార్పులు ఉంటాయి. కానీ అధ్యక్షుడు ఎన్నికల రేస్ లో నేను లేను…
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. చిన్నస్థాయి నేతలనే ఆ పార్టీలో కంట్రోల్ చేయడం కష్టం. అలాంటిది సీనియర్లను కట్టడి చేయాలంటే అధిష్టానానికి తలప్రాణం తోకలోకి వస్తుంది. ఆపార్టీకి సుప్రీం సోనియాగాంధీనే. ఆమె నిర్ణయాలే పార్టీలో ఫైనల్. పార్టీలోని సీనియర్ల సలహాలను పరిగణలోకి తీసుకొని ఆమె ఏ నిర్ణయమైన ఆచితూచి అమలు చేస్తుంటారు. అయితే అనారోగ్య కారణాల రీత్య సోనియాగాంధీ తన బాధ్యతలను రాహుల్ గాంధీకి అప్పగించాలని చూస్తున్నారు. దీనిపై పార్టీలో గత కొంతకాలంగా చర్చ నడుస్తూనే…