ఓయూ ముట్టడి ఘటనలో అరెస్టైన ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులను పరామర్శిచేందుకు వెళ్లిన జగ్గారెడ్డిని సైతం పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. జగ్గారెడ్డిని కలిసేందుకు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో గీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ యూనివ్సిటీకి వస్తే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ నీ సీఎం చేసిందే విద్యార్దులు అని, విద్యార్ధుల దగ్గరకు రాహుల్ గాంధీ వస్తె తప్పేంటని ఆమె మండిపడ్డారు.
అనుమతి కోసం అడిగితే అరెస్టులు చేస్తారా అని ఆమె మండిపడ్డారు. అరెస్ట్ చేసిన వాళ్ళను కలవడం కోసం వస్తె జగ్గారెడ్డి అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. అనంతరం మధు యాష్కీ మాట్లాడుతూ..పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయిన నాయకులను పలకరించడం కోసం వస్తే కూడా అరెస్ట్ చేయడం ఇక్కడే చూస్తున్నామన్నారు. దుర్మార్గపు పాలన నడుస్తుందని, యూనివర్సిటీ లు అన్ని తిరుగితమన్నారు. విద్యార్దులను ఏకం చేస్తామని ఆయన వెల్లడించారు.