కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంటూ దేశ రాజధాని శివార్లలో రైతు సంఘాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి.. కేంద్రం ఆ వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకున్నా.. మరికొన్ని డిమాండ్లతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. చలి, ఎండ, వాన ఇలా ఏదీ లెక్కచేయకుండా ఆందోళన చేసిన రైతులు చాలా మంది వివిధ కారణాలతో ప్రాణాలు వదిలారు.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కన్నుమూశారు.. అయితే, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌పై కేంద్ర వ్యవసాయ…
నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో బొగ్గు గని కార్మికులను మిలిటెంట్లుగా భావించి భద్రతా బలగాలు జరిపిన కాల్పుల ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో సుమారు 13 మంది మృతి చెందగా.. మరో 11 మంది గాయపడిన సంగతి విధితమే. ఆ తర్వాత జరిగిన ఉద్రిక్తల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హోం మంత్రిత్వ శాఖ…
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోశయ్య కుమారుడు శివకు ఫోన్ చేసి రాహుల్ గాంధీ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. అనంతరం కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావుకు కూడా రాహుల్ గాంధీ ఫోన్ చేసి రోశయ్య మరణంపై వివరాలను తెలుసుకున్నారు. Read Also:…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు ఏపీ పీసీసీ చీఫ్ శైలజా నాథ్ చురకలు అంటించారు. ఈసందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీని విమర్శించే స్థాయి పీకేది కాదని అన్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోబోమన్నారు. ప్రశాంత్ కిషోర్‌ను ఓ బ్రోకర్‌గా అభివర్ణించారు. ప్రశాంత్ కిషోర్ నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి బలికావాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏంటో ప్రశాంత్‌కిషోర్‌కు ఏమైనా తెలుసా అంటూ మండిపడ్డారు. ఏపార్టీ డబ్బులు ఇస్తే..…
గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను తీసుకవచ్చిన విషయం తెలిసిందే. అయితే చట్టాలు ఆమోదయోగ్యంగా లేవంటూ ఇటు ప్రతిపక్షాలు, అటు రైతులు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశ రాజధాని ఢిల్లీలో సంవత్సరం పాటు రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకొని 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నేడు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ వ్యవసాయ చట్టాల…
మూలిగే నక్కపై తాటి పండు పడటం అంటే ఇదే. కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ. అసలే దాని పరిస్థితి బాగా లేదు. దేశంలో ఎన్నడూ లేనంతగా బలహీన పడింది. తొలి నుంచి ఈశాన్య భారతం కాంగ్రెస్‌కు పెట్టని కోట. కానీ ఇప్పుడు అక్కడ ఖాళీ అవుతోంది. బలంగా ఉన్న ఏకైక రాష్ట్రం మేఘాలయ కూడా చేయి దాటి పోయింది. దాంతో ఈశాన్య రాష్ట్రాలలో హస్తం పని అయిపోయింది అనే భావన కలిగిస్తోంది. మేఘాలయలో 17 మంది కాంగ్రెస్…
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించు కుంటున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విజయమే నని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభివర్ణించారు. కాంగ్రెస్ మొదటి నుంచి చెబుతూనే వస్తుందని, ఆరైతు చట్టాల్లో రైతు ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశాలు ఉన్నాయని, ఆ చట్టాల రూపకల్పన, అమలు విషయలో కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అని అన్నారు. ఈ విషయమై ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ దేశ రైతాంగాన్ని అప్రమత్తం చేయడమే కాకుండా వారు చేపట్టిన…
కొత్త సాగుచట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రైతు చట్టాలు రద్దు చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రైతు చట్టాలు వెనక్కి తీసుకోవడంపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేంద్రప్రభుత్వం అహంకారాన్ని రైతుల సత్యాగ్రహం ఓడించిందని ట్వీట్ చేశారు. రైతు చట్టాలు తీసుకురావడమే తప్పని, రైతులు ఏడాది కాలంగా పోరాటం చేస్తున్నారని, ఈ పోరాటంలో అనేకమంది అన్నదాతలు ప్రాణాలు…
t20ప్రపంచ కప్‌లో వరుస ఓటములతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ప్రమాదంలో పడనున్నట్టు తెలుస్తోంది. కెప్టెన్సీ మార్పుపై త్వరలో జరగనున్న బీసీసీఐ సెలెక్టర్ల సమావేశంలో చర్చ జరగనుందని ఓ అధికారి తెలిపారు. వరుస ఓటములు టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడంతో బీసీసీఐ అసంతృప్తిగా ఉందని, కోహ్లీని వన్డే సారథ్యం నుంచి కుడా తప్పించాలని భావిస్తున్నట్టు తెలిపారు. వన్టేలు, టీ20లకు రోహిత్ లేదా మరెవరైనా.. టెస్టులకు కోహ్లీని సారథిగా ఉంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కోహ్లీకి…
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా పరాజయం పాలు అవుతుండటంతో అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అభిమానులు అయితే హద్దు మీరి విమర్శలు చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కుమార్తె వామికను అత్యాచారం చేస్తామని బెదిరించారు. ఈ విషయంలో విరాట్ కోహ్లీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. ‘డియర్ విరాట్.. కొంతమంది మనుషులు పూర్తిగా ద్వేషంతో నిండిపోయి ఉంటారు. ఎందుకంటే వారికి ఎవ్వరూ ప్రేమను పంచరు. వాళ్లను క్షమించు. జట్టును రక్షించుకో’ అంటూ…