ఓయూలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌ను ముట్టడించేందుకు వెళ్లిన ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే అరెస్టైన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో జగ్గారెడ్డి అరెస్ట్‌పై జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ స్పందించారు. ప్రశ్నించే గొంతుకలు విశ్వవిద్యాలయాలని ఆయన అన్నారు. ఓయూ కు రాహుల్ వచ్చేలా అనుమతి ఇవ్వాలని విద్యార్థులు నిరసన తెలపడానికి వెళ్లితే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారన్నారు. రాష్ట్రంలో నిర్బంధ వాతావరణం వుందని, జగ్గారెడ్డి అరెస్ట్ ను ఖండిస్తున్నామన్నారు.
గతంలో చాలా మంది నేతలు మీటింగ్ లు పెట్టారని, రాహుల్.. నిషేదిత సంస్థకు చెందిన నాయకుడు కాదు కదా.. మారేందుకు భయం.. ఆయన ఓయూకు వస్తానంటే మీకేందుకు భయం అని శ్రవణ్ ప్రశ్నించారు. రాహుల్ ఓయూకు వస్తే.. జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని టీఆర్‌ఎస్ నేతల ఆందోళన అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ట్స్ కాలేజీ బయట కూర్చుంద్దాం రండీ.. మీ బండారం బయటపెట్టకపోతే మేము బట్టలు విప్పుకొని వస్తాం.. హరీష్ రావు, కేటీఆర్ లకు దమ్ముందా… ఆయన సవాల్ విసిరారు.