కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.. తెలంగాణ హైకోర్టు న్యాయవాది రామారావు హెచ్ఆర్సీలో ఈ ఫిర్యాదు చేశారు.. కాంగ్రెస్ పార్టీ శాంతిభద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తోందని తన ఫిర్యాదులో ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణలు ప్రేరేపించే విధంగా వారి వ్యవహారం ఉందంటూ హెచ్ఆర్సీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. Read Also: Rahul Gandhi in Pub: సాయిరెడ్డికి ఠాగూర్ స్ట్రాంగ్…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటనపై రచ్చ జరుగుతోంది. నేపాల్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ వీడియో ఒకటి బయటకు వచ్చింది.. అది నైట్ క్లబ్ వీడియో అంటూ బీజేపీ నేతలు వైరల్ చేస్తూ.. రాహుల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.. దీనికి కాంగ్రెస్ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి.. ఇక, ఆ వీడియోపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించిన తీరుపై కాంగ్రెస్ మండిపడుతోంది.. చైనా దౌత్యవేత్తలతో కలిసి నేపాల్ నైట్ క్లబ్లో రాహుల్ గాంధీ పార్టీ…
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీకి చెందిన ఓ నైట్ క్లబ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నేపాల్ రాజధాని ఖాట్మండులోని ఓ నైట్ క్లబ్లో రాహుల్ గాంధీ పక్కన ఓ మహిళ ఉండటంపై విమర్శల వర్షం కురుస్తోంది. బీజేపీ జాతీయ ఐటీ విభాగం చీఫ్ మాళవియా రాహుల్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసి ఆమె రాహుల్ గాంధీకి చురకలు అంటించారు. సొంతపార్టీలో రచ్చ నడుస్తుంటే ఆయన మాత్రం నైట్ క్లబ్లో…
* నేడు ఉస్మానియా యూనివర్శిటీకి రేవంత్ రెడ్డి. ఓయూ వీసీని కలవనున్న రేవంత్ రెడ్డి. సభకు అనుమతి కోరనున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. *నేటినుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం. భక్తుల సంఖ్యపై పరిమితి విధించిన ప్రభుత్వం * నేడు రెండవ రోజు ప్రధాని మోడీ యూరప్ పర్యటన *వరంగల్ లో నేటి నుండి శ్రీ భద్రకాళీ దేవాలయంలో శ్రీ భద్రకాళీ వీరభద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం. *తిరుపతి రుయా ఆసుపత్రిలో నేటి నుంచి అందుబాటులోకి…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో.. ఆయనతో ఓ కార్యక్రమం నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నా అనుమతి మాత్రం దొరకలేదు.. ఇక, ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.. అయితే, ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతిపై వీసీదే తుది నిర్ణయమని చెప్పింది హైకోర్టు.. ఓయూ విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాహుల్ గాంధీ టూర్ అనుమతికి సంబంధించిన అవకాశాన్ని పరిశీలించాలని…
ఇప్పుడు వరంగల్‌లో రాజకీయ పరిణామాలు హీట్ పెంచుతున్నాయి.. ఇప్పటికే వరంగల్‌లో పలు సార్లు మంత్రి కేటీఆర్ పర్యటించారు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన ఖరారైన తర్వాత కూడా ఈ మధ్యే వరంగల్‌కు వెళ్లివచ్చారు.. ఇప్పుడు మరోసారి అదే జిల్లాలో టూర్‌కు సిద్ధం అయ్యారు. అది కూడా రాహుల్ గాంధీ సభ ముగిసిన మరుసటి రోజే కావడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 6వ తేదీన వరంగల్ వస్తున్నారు రాహుల్.. రైతు సంఘర్షణ సభ పేరుతో భారీ…
తెలంగాణ రాజకీయాలు హీట్ మీద ఉన్నాయి. ఎన్నికలకు గడువు చాలా ఉన్నా.. పార్టీలు మాత్రం ఎవరి వ్యూహానికి వాళ్లు పదును పెడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఒక స్ట్రాటజీని అందజేశారట పార్టీ వ్యూహకర్త సునీల్. ఆ వ్యూహంలో భాగంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌లు రహస్యంగా భేటీ అయ్యారట. ఈ సమావేశం గురించి అటు కాంగ్రెస్ నాయకులకు.. ఇటు TJS ప్రతినిధులకు కూడా తెలియదట. దాంతో రేవంత్, ప్రొఫెసర్ ఇద్దరూ ఎందుకు రహస్యంగా…
జగ్గారెడ్డి అరెస్ట్‌పై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. అరెస్టైన వారిని పరామర్శించడానికి పోతే.. అరెస్టులు చేస్తారా అంటూ.. కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ టీపీసీసీ ప్రెసిడెండ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ కి రాహుల్ గాంధీ తప్పకుండా వెళ్తారని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమంలో విద్యార్ధుల పాత్ర కీలకమని, ఉస్మానియా యూనివర్సిటీ కేసీఆర్ నా జాగీరు అనుకుంటున్నారని ఆయన అగ్రహం వ్యక్తం…
ఓయూ ముట్టడి ఘటనలో అరెస్టైన ఎన్ఎస్యూఐ విద్యార్థులను పరామర్శిచేందుకు వెళ్లిన జగ్గారెడ్డిని సైతం పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. జగ్గారెడ్డిని కలిసేందుకు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో గీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ యూనివ్సిటీకి వస్తే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ నీ సీఎం చేసిందే విద్యార్దులు అని, విద్యార్ధుల దగ్గరకు…
ఓయూలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌ను ముట్టడించేందుకు వెళ్లిన ఎన్ఎస్యూఐ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే అరెస్టైన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో జగ్గారెడ్డి అరెస్ట్‌పై జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ స్పందించారు. ప్రశ్నించే గొంతుకలు విశ్వవిద్యాలయాలని ఆయన అన్నారు. ఓయూ కు రాహుల్ వచ్చేలా అనుమతి ఇవ్వాలని విద్యార్థులు నిరసన తెలపడానికి వెళ్లితే వారిని అరెస్ట్ చేసి పోలీస్…