తెలంగాణ కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగబోయే ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోకూడదని, మీడియాకి ఎక్కి పార్టీ పరువును గంగపాలు చేయవద్దన్న సూచనలకు అనుగుణంగా తాజా పరిణామాలపై వీహెచ్ తనదైన రీతిలో స్పందించారు. రేవంత్ రెడ్డి పై వీహెచ్ కామెంట్స్ చేశారు.
రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో మాట్లాడినా బీసీ, ఎస్సీ ఎస్టీల లో ఒక విధమైన ఆలోచన వచ్చింది. కానీ నీ విషయంలో నేను బయట మాట్లాడలేను. నేను ఓబీసీ మాజీ కన్వీనర్గా ఆయన తోటి మాట్లాడుతానన్నారు వీహెచ్. యాదాద్రి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు ఈ విషయంపై మీటింగ్ లో మాట్లాడతాను. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను నువ్వు మన వైపు తిప్పుకుంటేనే మనకు మెజార్టీ వస్తుందని నా ఆలోచన అన్నారు వీహెచ్.
అదే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ కి కూడా ఉందన్నారు. రాహుల్ గాంధీ, మానిక్కం ఠాగూర్ చెప్పిన విధంగా బయట ఏమీ మాట్లాడకూడదు. అదే విషయంమై పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మీటింగ్ లో మాట్లాడతానన్నారు. రేవంత్ రెడ్డి కామెంట్స్ ను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు వి.హనుమంతరావు. నిన్న రేవంత్ రెడ్డి రచ్చబండ సందర్భంగా రెడ్లకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అధిష్టానం పూర్తి స్వేచ్ఛనిచ్చిందన్నారు. రెడ్లను విస్మరింగవద్దన్నారు.
Revanth Reddy: రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ