కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ (Sonia Gandhi), ఆమె తనయుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పట్ల కేంద్ర ప్రభుత్వ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈడీ పేరుతో తాజాగా సోనియాగాంధీని విచారిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఎవరూ భయపెట్టలేరన్నారు ఏపీసీసీ చీఫ్ సాకె శైలజానాథ్. రాజ్యాంగ వ్యవస్థలను, నిఘా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న మోడీ ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. ఈ నెల 21న సోనియా గాంధీ ఈడీ ముందు హాజరయ్యారు. మరోసారి ఈనెల 26న ఈడీ విచారణకు రానున్నారు.
సోనియా గాంధీపై ఈడి విచారణ కక్షపూరితధోరణికి సంకేతం అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా కక్ష సాధించడానికి, ఈడీ, ఐటీ , సిబిఐ లను దుర్వినియోగం చేస్తోందని విమర్శలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case) లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పై పెట్టిన తప్పుడు కేసులను న్యాయబద్ధంగా ఎదుర్కొంటాం అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించే సమయం ఆసన్నమైందన్నారు.
Draupadi Murmu: ప్రమాణ స్వీకారంలో సంతాలి చీర ధరించిన ముర్ము.. ప్రత్యేకతలేంటో తెలుసా?
ఈ నెల 26న విజయవాడలో సోనియాగాంధీని ఈడీ విచారించడంపై శాంతియుత సత్యాగ్రహం నిర్వహిస్తున్నాం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ సత్యాగ్రహంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నేషనల్ హెరాల్డ్ ముద్రించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు ఉన్న రూ.90కోట్ల అప్పును యంగ్ ఇండియాకు బదలాయించడంపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈడీ ప్రధానంగా ఈ అంశంపైనే ప్రశ్నలు సంధించే అవకాశముంది.
యంగ్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టరుగా ఉన్న సోనియాకు 38శాతం వాటా ఎలా వచ్చిందన్న దానిపైన ఫోకస్ పెట్టనున్నారు. ఇంతకుముందే ఢిల్లీలో ఎంపీలు, కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. మళ్ళీ ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఎక్కడా హింసాత్మక చర్యలకు దిగకుండా శాంతియుతంగా నిరసనలు తెలపాలని సూచించింది. మంగళవారం ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ ఈడీ కార్యాలయానికి వెళ్ళనున్నారు. మరి ఈ సారి ఈడీ ఎంతసేపు సోనియాగాంధీని విచారిస్తుందో చూడాలి.
Srinu Vaitla: భార్య లేకున్నా వారు ఉంటే చాలు అంటున్న స్టార్ డైరెక్టర్..?