Gujarat Elections: గుజరాత్ రాష్ట్రంలో తొలివిడుత ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. తొలి విడతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారి భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో పెట్టారు. కాగా, ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల రోజు పెళ్లి పెట్టుకున్న పలు జంటలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు.
Read Also: Haryana: ముందు నువ్వు చస్తావా.. నేను చావనా.. పందెం వేసుకున్న తాగుబోతులు.. సీన్ కట్ చేస్తే
ప్రస్తుతం మనిషి జీవితం బిజీగా మారింది. బిజీలో పడి రాజ్యంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించేందుకు కూడా బద్ధకిస్తున్నారు. ఈ క్రమంలో ప్రఫుల్‌బీ అనే యువకుడు ఓటు వేసేందుకు తన పెళ్లినే వాయిదా వేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. తపి జిల్లాలో ప్రఫుల్‌బీ అనే యువకుడు ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఏకంగా పెళ్లి సమయాన్నే మార్చుకున్నాడు. ప్రఫుల్‌బీ పెళ్లి మహారాష్ట్రలో గురువారం ఉదయం జరిపించేందుకు పెద్దలు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అదేరోజు పోలింగ్ ఉండటంతో తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. ఓటు వేసిన అనంతరం పోలింగ్ కేంద్రం వద్ద ప్రఫుల్‌బీ మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి. నా పెళ్లి వేడుకను గురువారం ఉదయం జరిపించేలా ముందుగా ప్రణాళిక వేసుకున్నాం. అయితే, పోలింగ్ నేపథ్యంలో వేడుకను సాయంత్రానికి వాయిదా వేసుకున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
#GujaratAssemblyPolls | Prafulbhai More, a man whose wedding is scheduled for today casts his vote in Tapi
He says, "I urge everyone to vote, you shouldn't waste it. My wedding was scheduled for the morning but I rescheduled it for the evening, we've to go to Maharashtra for it" pic.twitter.com/q1nWt9q8k1
— ANI (@ANI) December 1, 2022