Gujarat Polls: సైకిల్ కు సిలిండర్ కట్టుకుని ఓటేసేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. కచ్-సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ రోజు 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అందరి దృష్టిని ఆకర్షించారు. అమ్రేలిలో హస్తం పార్టీ ఎమ్మెల్యే పరేశ్ ధనాని.. సైకిల్‌కి సిలిండర్ కట్టుకుని తన కుటుంబ సభ్యులతో ఓటేయడానికి వెళ్లారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయని దానిపై రాశారు.
#WATCH | Amreli: Congress MLA Paresh Dhanani leaves his residence, to cast his vote, with a gas cylinder on a bicycle underscoring the issue of high fuel prices.#GujaratAssemblyPolls pic.twitter.com/QxfYf1QgQR
Also Read
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
— ANI (@ANI) December 1, 2022
ఇదిలావుండగా, ఉపాధి, చౌక గ్యాస్ సిలిండర్లు, రైతులకు రుణమాఫీ, రాష్ట్ర ప్రగతిశీల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ గుజరాత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.‘గుజరాత్ సోదర సోదరీమణులందరికీ విజ్ఞప్తి… ఉపాధి, చౌక గ్యాస్ సిలిండర్లు, రైతుల రుణమాఫీ, గుజరాత్ ప్రగతిశీల భవిష్యత్తు కోసం ఓటు వేయండి’ అని గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.
गुजरात के सभी भाई बहनों से अपील है, वोट करें…
रोज़गार के लिए
सस्ते गैस सिलेंडर के लिए
किसानों की कर्ज़ा माफी के लिएगुजरात के प्रगतिशील भविष्य के लिए, भारी संख्या में मतदान करें और लोकतंत्र के इस पर्व को सफल बनाएं।#કોંગ્રેસ_આવે_છે
— Rahul Gandhi (@RahulGandhi) December 1, 2022
ఇలా బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఓటర్ల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నది. గుజరాత్ నేడు ప్రజాస్వామ్య పండుగ జరుపుకుంటుందని అన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. ఈ రోజు, డిసెంబర్ 5న జరిగే గుజరాత్ ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం తరుపున విజ్ఞప్తి చేశారు. గుజరాత్ ఎన్నికల్లో ఈ సారి 4.9 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. రెండు దశాబ్ధాలుగా బీజేపీకి గుజరాత్ కంచుకోటగా ఉంది. 2017 ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాల్లో, కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలుపొందింది. ఈ సారి మాత్రం రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ బరిలో ఉంది. పంజాబ్ రాష్ట్రంలో గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఆప్ గుజరాత్ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోంది.
తాజావార్తలు
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!