Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో 68 అసెంబ్లీ స్థానాలకు గాను 40 స్థానాలను గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్ బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ, పార్టీ అభ్యర్థులు 15 స్థానాల్లో 2,000 కంటే తక్కువ మెజారిటీతోనే విజయం సాధించడం గమనార్హం. భోరంజ్, సుజన్‌పూర్, దరాంగ్, బిలాస్‌పూర్, శ్రీ నైనా దేవి, రాంపూర్, షిల్లై, శ్రీ రేణుకాజీలలో రెండు పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్ల సంఖ్యలో 1,000 ఓట్లలోపే తేడా వచ్చింది. భట్టియాత్, బల్హ్, ఉనా, జస్వాన్ ప్రాగ్‌పూర్, లాహౌల్, స్పితి, సర్కాఘాట్, నహాన్‌లలో 1,000 నుంచి 2,000 మధ్య మాత్రమే వ్యత్యాసం ఉంది.
రాజీనామా చేసిన ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ 38,183 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించగా.. ఆయన తర్వాత మండి జిల్లాలోని సెరాజ్ నుంచి బీజేపీకి చెందిన పవన్ కాజల్ కాంగ్రాలో 19,834 ఓట్ల తేడాతో గెలుపొందారు. రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన రోహ్రులో కాంగ్రెస్ అభ్యర్థి మోహన్ లాల్ బ్రాక్తా 19,339 ఓట్ల ఆధిక్యం సాధించారు.
భోరంజ్‌లో కాంగ్రెస్‌కు చెందిన సురేష్ కుమార్ కేవలం 60 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఇదే అత్యల్ప ఆధిక్యం. శ్రీ నైనా దేవి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రణధీర్ శర్మ 171 ఓట్ల తేడాతో గెలుపొందగా, బిలాస్‌పూర్ నుంచి త్రిలోక్ జమ్వాల్ 276 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్, బీజేపీలకు వరుసగా 40, 25 సీట్లు వచ్చినా ఓట్ల శాతంలో తేడా మాత్రం 0.90 శాతం మాత్రమే. కేవలం 20 వేల ఓట్లు మాత్రం రెండు పార్టీల మధ్య తేడా.
Royal Airforce: వంట నూనెతో విమానం ఎగురుతుందట.. చరిత్ర సృష్టించిన ఆర్ఏఎఫ్
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు రాహుల్ గాంధీ హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గెలిచిన ఎమ్మెల్యేలు ఎటు వెళ్లకుండా చండీగఢ్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం రేసులో మాజీ సీఎం వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్ పేరుతో పాటు ముకేశ్ అగ్నిహోత్రి, సుఖ్విందర్ సుఖు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక్కశాతం కంటే తక్కువ ఓట్లతో గెలుపోటములు జరిగాయన్నారు ప్రధాన మంత్రి మోడీ. ఇంత తక్కువ ఓట్ల శాతంతో గతంలో గెలుపోటములు ఎప్పుడూ జరగలేదన్నారు. బీహార్ ఉపఎన్నికలోనూ ప్రజలు బీజేపీకే పట్టం కట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది బీజేపీకి మంచి సూచన అని అన్నారు.