కనుమరుగైపోయింది అనుకున్న ర్యాగింగ్ భూతం మళ్లీ వచ్చింది..!! మరో అమాయక విద్యార్థిని బలి తీసుకుంది. మేడిపల్లిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్‌లో సెకండ్ ఇయర్ చదువుతున్న సాయితేజ.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీనియర్లు కొట్టారని.. ర్యాగింగ్ చేస్తున్నారని.. డబ్బులు కావాలని వేధిస్తున్నారంటూ తండ్రికి సెల్ఫీ వీడియో పంపి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం నగలకొండకు చెందిన సాయితేజ.. హైదరాబాద్ మేడిపల్లిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్‌లో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నిన్న రాత్రి తన…
కాలేజీల్లో ర్యాగింగ్ భూతం ఎంత దారుణంగా ఉంటుందో మనం చూశాం. ఐతే ప్రభుత్వాలు ర్యాగింగ్ మీద దృష్టి పెట్టడంతో దాదాపు ఇప్పుడు కంట్రోల్‌లోనే ఉంది. కానీ విచిత్రంగా ఓ కార్పోరేట్ స్కూలులోనే ర్యాగింగ్ మళ్లీ చిగురించడం కలకలం రేపుతోంది. నిజానికి స్కూల్లో ర్యాగింగ్ చాలా తక్కువ. కానీ రాజమండ్రిలోని శ్రీచైతన్య స్కూలులో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో దారుణంగా హింసించారు. ఈ ఘటనతో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్క పడ్డారు. ఇక్కడ చూడండి.. బెడ్‌పై దీనంగా…
KLR Pharmacy College Ragging Case: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేఎల్‌ఆర్ ఫార్మసీ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ర్యాగింగ్ వేధింపులకు తాళలేక కాలేజీ నుంచి చాలా మంది విద్యార్థులు వెళ్లిపోతున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఓ బాధిత విద్యార్థిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ)ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ర్యాగింగ్ వేధింపులు భరించలేక కాలేజీ నుంచి వెళ్లిపోయిన తనకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం…
Kashmiri MBBS Student: కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌లో గల అల్-అమీన్ మెడికల్ కాలేజీలో చదువుతున్న కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు చెందిన సెకండ్ ఇయర్ MBBS విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పాటు దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. దీనిపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ సంఘటనచడ జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్పందించింది.
Kerala ragging horror: కేరళలో ర్యాగింగ్ భూతం పరాకాష్టకు చేరుకుంది. ఇటీవల ర్యాగింగ్ కారణంగా ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళలోని కొట్టాయం జిల్లాలోని ఒక నర్సింగ్ కాలేజీలో ఐదుగురు విద్యార్థులు తమ జూనియర్లను దారుణంగా ర్యాగింగ్ చేశారు.
Ragging: ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల బాలుడు బలయ్యాడదు. కేరళలోని టీనేజర్ మిహిర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. స్కూల్‌లో ర్యాగింగ్, బెదిరింపులతో ప్రాణం తీసుకున్నాడు. కేరళలోని ఎర్నాకుళంలోని త్రిప్పునితురలో జనవరి 15న మిహిర్ తన అపార్ట్‌మెంట్ భవనంలోని 26వ అంతస్తు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమారుడు ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలను అతడి తల్లి రజ్నా పీఎం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
నల్గొండ మెడికల్ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ర్యాగింగ్ ఘటనపై పై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మీడియాలో వరస కథనాల ద్వారానే ర్యాగింగ్ విషయం తెలిసిందని నేషనల్ మెడికల్ కౌన్సిల్ లేఖలో పేర్కొంది. అసలు కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉందా లేదా అని ప్రశ్నించింది.
గుజరాత్ రాష్ట్రం పటాన్‌లోని ధర్‌పూర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సీనియర్ల ర్యాగింగ్ కారణంగా ఓ వైద్య విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన తర్వాత, కళాశాల అడ్మినిస్ట్రేషన్ 15 మంది సీనియర్ విద్యార్థులను అకడమిక్, హాస్టల్ కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేసింది.