Hyderabad: తెలంగాణలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ఈ ర్యాగింగ్ భూతం వల్ల ఎంతో మంది విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును కోల్పోయారు. నిజానికి అన్ని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు వేస్తున్నారు.
ర్యాగింగ్ నియంత్రణకు ఎంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ నియంత్రణ కావడం లేదు. దేశంలోని ఏదో ఒక విద్యా సంస్థలో ఏదో రూపంలో ర్యాగింగ్ భూతం బయటపడుతోంది.