కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ దృష్టి పెట్టింది. ర్యాగింగ్ పై విచారణకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) ఆదేశించింది. యాంటీ ర్యాగింగ్ కమిటీ చేత విచారణ జరిపించాలని ఎన్ ఎం సి ఆదేశించింది.
రాయలసీమ యూనివర్సిటీలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం సృష్టించింది.. యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ చర్చగా మారింది.. ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థి సునీల్ పై సీనియర్లు దాడి చేశారు. పరిచయ వేదిక పేరుతో హాస్టల్ లోకి ప్రవేశించిన సీనియర్లు.. సునీల్‌పై దాడి చేశారట.. అయితే, సీనియర్ల బారినుంచి తప్పించుకునే ప్రయత్నంలో హాస్ట్‌ల్ వదిలి.. కాలేజీలో గ్రౌండ్ లో పరుగులు పెట్టాడు సునీల్..
ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. మూడురోజుల క్రితం వెలుగుచూసిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్టీవీలో ప్రసారం అయిన కథనాలకు అధికారులు స్పందించి ర్యాగింగ్ చేసిన సీనియర్ విద్యార్ధినులు పది మందిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు.
ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా విద్యార్థుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఆయా కాలేజీల్లో ఇప్పటికే ర్యాంగింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. సీనియర్లు.. జూనియర్లను వేధించడం పరిపాటిగా మారిపోతున్నాయి.
ఇప్పటివరకూ కళాశాల స్థాయిలోనే వినిపించే మాట ఇది. ఇప్పుడది పాఠశాలలు, ప్రభుత్వ వసతిగృహాల్లో వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది.
కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. వర్సిటీ మహిళా హాస్టల్ లో చాప కింద నీరులా ర్యాగింగ్ భూతం విస్తరిస్తోంది. జూనియర్ విద్యార్థినిలపై సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలతో ఏకంగా 81 మంది స్టూడెంట్స్ ను వర్సిటీ అధికారులు హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేశారు.
కర్నూలు మెడికల్ కాలేజీలో సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్ విద్యార్థులు ఆరోపించడం కలకలం రేపింది. సీనియర్ల వేధింపులపై ఏకంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం సంచలనంగా మారింది.