Raging in MBBS College: ఎంబీబీఎస్ కాలేజీలో ర్యాగింగ్.. 3 గంటలు నిలబడి డ్యాన్స్ చేస్తూ విద్యార్థి మృతి!
- గుజరాత్ రాష్ట్రం పటాన్‌లోని ధర్‌పూర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్
- సీనియర్ల ర్యాగింగ్ కారణంగా ఓ వైద్య విద్యార్థి మృతి
- 15 మంది సీనియర్ విద్యార్థులు సస్పెండ్
- కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ రాష్ట్రం పటాన్‌లోని ధర్‌పూర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సీనియర్ల ర్యాగింగ్ కారణంగా ఓ వైద్య విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన తర్వాత, కళాశాల అడ్మినిస్ట్రేషన్ 15 మంది సీనియర్ విద్యార్థులను అకడమిక్, హాస్టల్ కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేసింది. ఈ విషయమై ధర్‌పూర్ మెడికల్ కాలేజీ అదనపు డీన్ పటాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నవంబర్ 1న అనిల్ మెథానియా మరణించారని, ఆ తర్వాత కాలేజీ డీన్ హార్దిక్ షా ర్యాగింగ్ నిరోధక కమిటీని ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కమిటీ విచారణ ప్రారంభించింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలు ఏం జరిగింది?
పోలీసుల కథనం ప్రకారం.. మొదటి సంవత్సరం విద్యార్థులను సీనియర్ విద్యార్థులు రాత్రి 8:30 గంటలకు పరిచయం చేసుకునేందుకు పిలిచారు. జూనియర్ విద్యార్థులు వెళ్లారు. అందులో చనిపోయిన విద్యార్థి అనిల్ కూడా ఉన్నాడు. ఈ సమయంలో సీనియర్లు జూనియర్లపై ర్యాగింగ్ ప్రారంభించారు. సినిమా పాటలు పాడుతూ.. డ్యాన్ చేయాలని అనిల్ ని సీనియర్లు పోర్స్ చేశారు. అతనిని దుర్భాషలాడాడు, మూడు గంటల పాటు అలాగే నిలబెట్టారు. అనిల్ ఆరోగ్యం క్షీణించడంతో తల తిరగడంతో కింద పడిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Also Read
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
15 మంది సీనియర్ విద్యార్థులు సస్పెండ్..
ఈ ఘటనపై కళాశాల కమిటీ ఇతర సీనియర్ విద్యార్థులను కూడా విచారించింది. వారు మొదటి సంవత్సరం విద్యార్థులు చెప్పిన విషయాన్ని సమర్థించారు. నిజంగానే ర్యాగింగ్ జరిగిందని తెలిపారు. దీని తర్వాత కమిటీ 15 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పటాన్ పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని 105, 127(2), 189(2), 190, 296(బి) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. కాలేజీలోని సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని డిప్యూటీ ఎస్పీ కేకే పాండ్య తెలిపారు. ఈ కేసును పూర్తిగా నిష్పక్షపాతంగా విచారించేందుకు వీలుగా సీనియర్ విద్యార్థులను అకడమిక్, హాస్టల్ కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేశామని కళాశాల యాజమాన్యం చెబుతోంది. ర్యాగింగ్‌ను యాంటీ ర్యాగింగ్ కమిటీ నిర్ధారించి కఠిన చర్యలు తీసుకుంటోంది.
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!