మ్యాచో హీరో గోపీచంద్ ఇటీవల ‘సీటిమార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకొంది కానీ గోపీచంద్ కి మాత్రం భారీ విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక దీంతో గోపీచంద్ ఆశలన్నీ తన తదుపరి సినిమా మీదనే పెట్టుకున్నాడు. హిట్ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో గోపీచంద్- రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్- యూవీ…
దివంగత గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి కలం నుంచి ఎన్నో స్ఫూర్తి దాయకమైన పాటలు జాలువారాయి. ప్రేక్షకులను ప్రభావితం చేసే పాట రాయాలంటే సీతారామశాస్త్రిని మించిన ఆప్షన్ మరొకటి లేదనేది చిత్రసీమలోని దర్శక నిర్మాతల అభిప్రాయం. ఆయన కెరీర్లో ఎన్నో అద్భుతమైన, ప్రభావవంతమైన పాటలు అందించారు. అలాంటి లెజెండరీ రైటర్ కలం నుంచి చివరిసారిగా జాలువారిన స్ఫూర్తి దాయక గీతం ‘పక్కా కమర్షియల్’లో ఉండటం విశేషం. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో…
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు ఇటీవల కొంచెం సన్నబడిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో నటిస్తుంది. మరోపక్క బాలీవుడ్ లో కూడా మంచి ఛాన్సులు పట్టేస్తుంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. నిత్యం హాట్ ఫోటోషూట్లతో పిచ్చెక్కించే ఈ ముద్దుగుమ్మ పండగపూట కూడా…
మన దక్షిణాది తారలు హిందీ చిత్రాలలో మెరవడం కొత్తేమీ కాదు. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూస్తున్న రోజుల్లోనే హిందీ సినిమాల్లో మన యన్టీఆర్ మూడు సినిమాల్లోనూ, ఏయన్నార్ ఓ చిత్రంలోనూ హీరోలుగా నటించి అలరించారు. ఇక వైజయంతి మాల, పద్మిని, అంజలీదేవి, సావిత్రి, జమున, బి.సరోజాదేవి, రాజశ్రీ, గీతాంజలి, జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటి హీరోయిన్లు సైతం హిందీ సినిమాల్లో తమ ఉనికిని చాటుకున్నారు. తమిళ నటుడు జెమినీ గణేశన్ కూడా కొన్ని హిందీ చిత్రాలలో అలరించారు.…
కోలీవుడ్ లో విభిన్నమైన కథలను ఎంచుకోవాలన్నా.. కొత్త కొత్త ప్రయోగాలు చేయాలన్నా హీరో కార్తీ ముందుంటాడు. ఇప్పటివరకు కార్తీ చేసిన సినిమాలన్నీ విభిన్నమైన కథలే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక కార్తీకి తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు ఎప్పటికప్పుడు తెలుగులోనూ డబ్ అవుతుంటాయి. ఇక ప్రస్తుతం కార్తీ ‘సర్దార్’, ‘విరుమన్’ చిత్రాలతో పాటు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఇకపోతే పాత్ర కోసం ప్రాణం పెట్టె…
నటి ఖుష్బూ భర్త సుందర్ సి. కి తమిళనాట దర్శకుడిగా మంచి పేరుంది. ‘అరుణాచలం’ వంటి వినోదభరిత చిత్రాలతో పాటు, ‘సత్యమే శివం’ వంటి థాట్ ప్రొవోకింగ్ మూవీస్ కూడా సుందర్ సి తీశాడు. అయితే… గత కొంతకాలంగా సరైన విజయాన్ని సాధించని సుందర్… సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని అనుకుంటున్న ప్రతిసారీ హారర్ జానర్ ను ఆశ్రయిస్తున్నాడు. అలా 2014లో ‘అరణ్మనై’ పేరుతో ఓ సినిమా తీశాడు. అది ‘చంద్రకళ’గా తెలుగులో డబ్ అయ్యింది. ఆ…
ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. ఈ చిత్రంతో బూరె బుగ్గల చిన్నదాన్ని టాలీవుడ్ ప్రేక్షకులు తెలుగింటి ఆడపడుచులా మార్చేసుకున్నారు. యంగ్ హీరోల సరసన నటిస్తూ అమ్మడు విజయాలను అందుకుంటూ వస్తుంది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు ఇటీవల ఈ బొద్దుగుమ్మ చిక్కిపోయి కనిపించినా తెలుగు ప్రేక్షకులు ఒకే అనేసుకున్నారు. తెలుగే కాకుండా అన్ని భాషల్లోనూ తన సత్తా చాటుతున్న ఈ ఢిల్లీ బ్యూటీ నేడు తన 31 వ పుట్టినరోజు…
ముద్దుగా బొద్దుగా మురిపిస్తూ తెలుగువారిని భలేగా ఆకట్టుకుంటోంది ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా. తెలుగు సినిమాలతోనే ఓ వెలుగు చూసిందీ ముద్దుగుమ్మ. కేవలం నటనతోనే కాకుండా తన గళంతోనూ ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. ఆరంభంలో బరువు దరువుతో అలరించిన రాశీ ఖన్నా, ఇప్పుడు నాజూకు సోకులు సొంతం చేసుకొని మరింతగా ఆకర్షిస్తోంది. దక్షిణాది చిత్రాలతోనే ఈ ఉత్తరాది అందం మెరిసిపోవడం విశేషం! రాశీ ఖన్నా 1990 నవంబర్ 30న ఢిల్లీలో జన్మించింది. అక్కడే లేడీస్ శ్రీరామ్ కాలేజ్…
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘అంధదూన్’ రీసెంట్ గా తెలుగులో రీమేక్ అయినా సంగతి తెలిసిందే. నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈచిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈ సినిమా మలయాళంలో కూడా తెరకెక్కుతోంది. రవి కె.చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. కథానాయికగా రాశి ఖన్నా నటించింది. బాలీవుడ్ లో ‘టబు’ చేసిన పాత్రను మలయాళంలో మమతా మోహన్ దాస్ చేసింది. ఇక మమతా…