రేపు టాలీవుడ్ హీరో గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెబుతూ ‘పక్కా కమర్షియల్’ నుంచి అట్రాక్టివ్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. గోపీచంద్ లాయర్ పాత్రలో నటిస్తుండగా.. తాజా పోస్టర్ లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా తీర్చిదిద్దుతున్నాడు. గోపీచంద్ సరసన రాశిఖన్నా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు జీఏ2 బ్యానర్లపై రూపొందుతోంది. బన్నీ వాస్ నిర్మాతగా…
సౌత్ స్టార్ హీరోలకు కొంత వరకూ ఓటీటీలపై చిన్న చూపు ఉందేమోగానీ… బాలీవుడ్ లో సీజన్ మారిపోయింది. వరుస లాక్ డౌన్ లు, థియేటర్ల మూసివేతతో డిజిటల్ స్ట్రీమింగ్ ని సీరియస్ గా తీసుకుంటున్నారు బీ-టౌన్ స్టార్స్. ఇప్పటికే కొందరు క్రేజ్, సీనియారిటీ ఉన్న హీరోలు వెబ్ సిరీస్ లతో సత్తా చాటగా తాజాగా అజయ్ దేవగణ్ డిజిటల్ డెబ్యూకి రెడీ అవుతున్నాడు.‘రుద్ర – ద ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’ పేరుతో డిస్నీ హాటస్టార్ వీఐపీ…
కరోనా కారణంగా ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పేదవారు… లాక్ డౌన్ వల్ల చేయడానికి పనిలేక, తినడానికి తిండి లేక ఎంతోమంది పస్తులు ఉంటున్నారు. వారి గురించి తాజాగా హీరోయిన్ రాశిఖన్నా ఓ వీడియోను షేర్ చేశారు. “ఈరోజు లక్షలాది మంది బ్రతకడానికి ఆహారమే ఆక్సిజన్ లా తయారయింది. ఈ మహమ్మారి తెచ్చిన ఏడుపుల ముందు ఆకలి కేకలు వినిపించకుండా పోయాయి. బహుశా ఆకలే వారిని కరోనా వైరస్ కంటే ముందు చంపేస్తుందేమో. జీవనాధారం కోల్పోయి సంపాదన…
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా రాబోతున్న ‘థాంక్యూ’ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే ఇటలీలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కోవిడ్ నేపథ్యంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ జరిపారు. అయితే తాజాగా ఇటలీ షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ పార్కులో కూర్చున్న చైతన్యను రాశిఖన్నా వెనకనుంచి గట్టిగా కౌగిలించుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో…
విజయ్ చందర్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, నివేదా పెతురాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘సంగతమీజన్ ’. గతేడాది నవంబర్ 15న ఏ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ తంబీలను విశేషంగా ఆకట్టుకున్న ఈ మాస్ ఎంటర్టైనర్ తెలుగులో ‘విజయ్ సేతుపతి’ టైటిల్ తో విడుదలైంది. వివేక్ మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు రైట్స్ ను హర్షిత మూవీస్ బ్యానర్ అధినేత రావూరి వి శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు.…
అవసరాల శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. తాజాగా ‘101 జిల్లాల అందగాడు’నుంచి ‘మనసా వినవా’ మెలోడీ లిరికల్ వీడియో సాంగ్ ను హీరోయిన్ రాశి ఖన్నా విడుదల చేసింది. శ్రీరామ్ చంద్ర, ధన్య బాలకృష్ణ ఈ సాంగ్ ను ఆలపించగా… భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. శక్తికాంత్ కార్తిక్ సంగీతాన్ని అందించారు. హీరోహీరోయిన్ల మధ్య సాగుతున్న ‘మనసా వినవా’ హార్ట్ ఫుల్ మెలోడీ లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి. కాగా…