Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Movie News Tollywood Stars In Bollywood

బాలీవుడ్ లో మన స్టార్స్!

Updated On - 04:06 PM, Tue - 11 January 22
By subbarao n
బాలీవుడ్ లో మన స్టార్స్!

మన దక్షిణాది తారలు హిందీ చిత్రాలలో మెరవడం కొత్తేమీ కాదు. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూస్తున్న రోజుల్లోనే హిందీ సినిమాల్లో మన యన్టీఆర్ మూడు సినిమాల్లోనూ, ఏయన్నార్ ఓ చిత్రంలోనూ హీరోలుగా నటించి అలరించారు. ఇక వైజయంతి మాల, పద్మిని, అంజలీదేవి, సావిత్రి, జమున, బి.సరోజాదేవి, రాజశ్రీ, గీతాంజలి, జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటి హీరోయిన్లు సైతం హిందీ సినిమాల్లో తమ ఉనికిని చాటుకున్నారు. తమిళ నటుడు జెమినీ గణేశన్ కూడా కొన్ని హిందీ చిత్రాలలో అలరించారు. తరువాతి తరం హీరోల్లో కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, జె.డి.చక్రవర్తి కూడా హిందీ చిత్రాల్లో తమదైన బాణీ పలికించారు.

ప్రస్తుతం గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోతోంది. ఈ సమయంలో ఉత్తరం, దక్షిణం అన్న తేడాలు చెరిగిపోతున్నాయి. ఒకప్పుడు సౌత్ సినిమా దక్షిణాదిని దాటి, ఉత్తరాదికి చేరుకోవాలంటే అక్కడి భాషల్లోకి అనువాదం కావలసి ఉండేది. కానీ, ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు ఉత్తరాదిన సైతం హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దక్షిణాది చిత్రాల్లో తళుక్కున మెరుస్తున్నవారు బాలీవుడ్ లో తడాఖా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

‘ఫ్యామిలీ మేన్-2’ సిరీస్ లో నటించి భళా అనిపించిన సమంత, ఇప్పుడు ఏకంగా ఓ హిందీ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతోంది. మన తెలుగు సినిమాలతో వెలుగు చూసి, తరువాత బాలీవుడ్ లో భళా అనిపించిన తాప్సీ పన్ను నిర్మించే సినిమాలో సమంతా నటిస్తున్నట్టు సమాచారం. ఆమెతో పాటు రష్మిక మందన్నా కూడా ‘మిషన్ మజ్ను’ అనే చిత్రంలో సిద్ధార్థ్‌ మల్ హోత్రా తో కలసి నటించబోతోంది. మరో నాయిక రాశీ ఖన్నా కూడా సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ‘యోధ’ అనే మరో సినిమాలో నటిస్తోంది.

ఇక మన యువకథానాయకుల్లో విజయ్ దేవరకొండ కూడా ‘లైగర్’తో హంగామా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘లైగర్’ను అక్కడ ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేస్తూ ఉండడం విశేషం. ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ కూడా అక్కడ అలరించింది. దాంతో ‘కబీర్ సింగ్’ ఒరిజినల్ హీరో అంటూ విజయ్ దేవర కొండకు స్పెషల్ గా పబ్లిసిటీ చేస్తున్నారు. అదీగాక ఈ ‘లైగర్’లో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ టైసన్ కూడా నటించడం ఓ పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. ఇక నాగచైతన్య అనువాద చిత్రాలు చూసిన బాలీవుడ్ టాప్ స్టార్ ఆమిర్ ఖాన్ తన ‘లాల్ సింగ్ ఛద్దా’లో ఓ కీలక పాత్రకు ఎన్నిక చేసుకున్నాడు. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. తెలుగులో ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందించిన ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అందులో మన తెలుగు హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరో. ఈ చిత్రానికి మన వి.వి.వినాయక్ దర్శకుడు. ఇలా యంగ్ హీరోస్ సైతం ఉత్తరాదిన తమ ఉనికిని చాటుకోవడానికి ఉరకలు వేస్తున్నారు. మరి నవతరం హీరోహీరోయిన్లలో ఎవరు బాలీవుడ్ లో తమ మార్కు చూపిస్తారో చూడాలి.

  • Tags
  • Bollywood
  • Naga Chaitanya
  • Raashi Khanna
  • Samantha
  • Tapsee Pannu

RELATED ARTICLES

Amrish Puri :అంతర్జాతీయంగా అలరించిన అమ్రిష్ పురి!

Samantha :చైతూ డేటింగ్ పై సమంత సీరియస్..!

LIVE : విడాకులపై విమర్శలు చేసేవారికి మరోసారి సమంత కౌంటర్! | Samantha Counter’s To Troller’s | Ntv

Chey fans trolling: క్లారిఫికేషన్ తో చాచికొట్టిన సమంత!

Ram Charan : రామ్ చరణ్ గెస్ట్ రోల్..!

తాజావార్తలు

  • Rohit Sharma: హిట్ మ్యాన్‌ కెరీర్‌కు 15 ఏళ్లు పూర్తి.. రోహిత్ ఎమోషనల్ లెటర్

  • Sanjay Raut: ఎమ్మెల్యేల నిర్ణయం అదే అయితే కూటమి నుంచి వైదొలగడానికి సిద్ధం

  • Ranadheer : ‘సీతారామ‌పురంలో ఒక ప్రేమ జంట’ టీజ‌ర్ విడుదల

  • Vaishnav Tej: మంచు హీరో వద్దంటే.. మెగా హీరోకు దక్కిందా..?

  • Vijaya Reddy: కాంగ్రెస్‌లో చేరిన పీజేఆర్‌ తనయ విజయారెడ్డి

ట్రెండింగ్‌

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

  • Viral News : ఇలాంటి వారుకూడా ఉంటారు మరీ.. ఇది చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions