ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. ఈ చిత్రంతో బూరె బుగ్గల చిన్నదాన్ని టాలీవుడ్ ప్రేక్షకులు తెలుగింటి ఆడపడుచులా మార్చేసుకున్నారు. యంగ్ హీరోల సరసన నటిస్తూ అమ్మడు విజయాలను అందుకుంటూ వస్తుంది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు ఇటీవల ఈ బొద్దుగుమ్మ చిక్కిపోయి కనిపించినా తెలుగు ప్రేక్షకులు ఒకే అనేసుకున్నారు. తెలుగే కాకుండా అన్ని భాషల్లోనూ తన సత్తా చాటుతున్న ఈ ఢిల్లీ బ్యూటీ నేడు తన 31 వ పుట్టినరోజు జరుపుకొంటుంది.
తాజాగా ఆమె నటించిన ‘పక్కా కమర్షియల్’ చిత్రం టీమ్ .. రాశీకి బర్త్ డే సర్ ప్రైజ్ ఇచ్చారు.. మారుతీ దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న ఈ చిత్రంలో రాశీ లాయర్ గా కనిపించబోతోంది. ఇక తాజాగా ఈ స్పెషల్ వీడియోలో రాశీ .. దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా కనిపించింది. స్వీటెస్ట్ & సూపర్ టాలెంటెడ్ రాశీఖన్నా కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంటూ మేకర్స్ తెలిపారు. నిజం చెప్పాలంటే రాశీని చూస్తే నిజంగానే దేవకన్య దిగివచ్చిందా అనేంత అందంగా ఉంది అని చెప్పొచ్చు. ఇకపోతే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది. మరి ఈ సినిమాతో అమ్మడు మరో హిట్ ని తనఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి.
"Pure as angel, Sweet as Love" 🧡🧚♀️
— UV Creations (@UV_Creations) November 30, 2021
Happy Birthday 💐🎂to our gorgeous & most talented actress @RaashiiKhanna_ – Team #PakkaCommercial #HBDRaashiiKhanna ▶ https://t.co/gNn4KU8j8p#AlluAravind @YoursGopichand @DirectorMaruthi #BunnyVas @JxBe #KarmChawla @SKNonline