అక్కినేని నాగ చైతన్య, రాశీ ఖన్నా జంటగా విక్రమ్ కె కుమార్ దర్శవంలో కత్వంలో తెరకెక్కుతున్న చిత్రం థాంక్యూ. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో చైతు క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. టైమ్ ట్రావెల్ కథగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మనం సినిమా తరువాత విక్రమ్ కె కుమార్ ఆశించిన విజయాన్ని అందులోకపోయాడు.
ఇక ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇకపోతే చైతూ సైతం లవ్ స్టోరీ సినిమా హిట్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. అనుకున్నట్లుగానే షూటింగ్ ని పూర్తి చేసుకొని త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక షూటింగ్ వ్రాప్ ఫోటోలను షేర్ చేస్తూ నాగ చైతన్య” థాంక్యూ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.. వీరి దగ్గర చాలా నేర్చుకున్నాను. ఏ సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలను మీతో పంచుకోవడానికి ఎదురుచూడలేకపోతున్నా” అంటూ ట్వీట్ చేశాడు. మరి ఈ సినిమాతో విక్రమ్ కె కుమార్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.