సింగపూర్ ఓపెన్‌లో తెలుగు తేజం పీవీ సింధు సత్తా చాటుతోంది. మహిళల సింగిల్స్‌లో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన పీవీ సింధు తాజాగా సెమీ ఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన హాన్ యూను 17-21, 21-11, 21-19 స్కోరుతో పీవీ సింధు మట్టి కరిపించింది. దీంతో టైటిల్ వేటకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. అటు ఈ సిరీస్‌లో మహిళల సింగిల్స్‌లో ఆదిలో సత్తా చాటిన మరో తెలుగు తేజం సైనా…
రిఫరీ చేసిన తప్పిదం వల్ల బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌సిప్ టోర్నీలో ఓటమి పాలైన పివి సింధుకి తాజాగా కమిటీ క్షమాపణలు చెప్పింది. ఆ మానవ తప్పిదానికి సారీ చెప్తున్నామని, ఇలాంటి పొరబాట్లు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ ఛైర్మన్ చిహ్ షెన్ చెన్ తెలిపారు. ‘‘ఆసియా ఛాంపియన్‌షిప్‌లో మీకు (పీవీ సింధు) కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్తున్నాం. ఇప్పుడు ఆ పొరబాటుని సరిదిద్దే అవకాశం లేదు. అయితే, భవిష్యత్తులో ఇలా జరగకుండా చర్యలు…
ఇండోనేషియా మాస్టర్స్‌లో భారత షట్లర్లు నిరాశ పరిచారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయారు. ఫలితంగా ఈ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 12–21, 10–21తో ఎనిమిదో ర్యాంకర్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలైంది. 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ పీవీ సింధు ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది. రచనోక్ చేతిలో సింధు ఇప్పటివరకు…
ఇండోనేసియా బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.గురువారం హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ సింధు 23–21, 20–22, 21–11తో గ్రెగోరియా మరిస్క టుంజుంగ్ (ఇండోనేసియా)పై చెమటోడ్చి గెలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 30వ స్థానంలో ఉన్న స్థానిక క్రీడాకారిణి గ్రెగొరియా సొంత ప్రేక్షకుల మధ్య సింధుకు తొలి రెండు గేమ్‌లలో గట్టి పోటీనిచ్చింది. తొలి గేమ్ ఆరంభంలో దూకుడుగానే ఆడిన భారత స్టార్ 10-5తో సులభంగా గేమ్ గెలిచేలా కనిపించింది.…
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఖాతాలో మరో టైటిల్ చేరింది. స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీని పీవీ సింధు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి బుసానన్‌పై 21-16, 21-8 తేడాతో పీవీ సింధు విజయం సాధించింది. 49 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో పీవీ సింధు సంపూర్ణ ఆధిపత్యం చేలాయించింది. ఈ ఏడాది సింధు ఖాతాలో ఇది రెండో టైటిల్ విజయం. ఈ ఏడాది జనవరిలో సయ్యద్ మోదీ…
సైబర్ బుల్లియింగ్, ట్రోలింగ్ లను తానూ ఎదుర్కొన్నానని పీవీ సింధు అన్నారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ‘మహిళలు, పిల్లలకు సైబర్ వరల్డ్ పై చైతన్య కార్యక్రమం’ అనే అంశంపై శనివారం రాష్ట్రంలోని వివిధ పాఠశాలలోని సైబర్ అంబాసిడర్లకు ప్రత్యేక చైతన్య కార్యక్రమమం నిర్వహించారు. ఈ చైతన్య కార్యక్రమానికి ప్రముఖ షెట్లర్ పీ.వీ సింధు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతీ లక్రా, ఐ.జీ. బి.సుమతి…
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. మరోసారి టైటిల్ గెలిచే అవకాశాన్ని పీవీ సింధు చేజార్చుకుంది. శనివారం జరిగిన సెమీస్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన సుపానిడా కటేథాంగ్ చేతిలో సింధు ఓటమిపాలైంది. 14-21, 21-13, 10-21 స్కోరు తేడాతో మ్యాచ్ కోల్పోయింది. దీంతో ఇండియా ఓపెన్ టోర్నీ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. Read Also: బిగ్ బ్రేకింగ్: టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై..!! కాగా శుక్రవారం జరిగిన క్వార్టర్…
భారత బ్మాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు మరోసారి అదరగొట్టింది. ఇండియన్ ఓపెన్-2022లో భాగంగా క్వార్టర్ ఫైనల్‌లో అశ్మిత చలిహా క్రీడాకారిణిని వరుసగా రెండు సెట్లలోనూ పీవీ సింధు ఓడించింది. తొలి సెట్‌లో 21-7 తేడాతో, రెండో సెట్‌లో 21-18 పాయింట్ల తేడాతో పీవీ సింధు విజయం సాధించింది. ఈ క్వార్టర్స్ గెలుపుతో పీవీ సింధు సెమీస్ బెర్తును సొంతం చేసుకుంది. Read Also: కేప్‌టౌన్ టెస్టులో టీమిండియా ఓటమి.. సిరీస్ సమర్పయామి అంతకుముందు మ్యాచ్‌లో ఏరా…
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(BWF) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా పీవీ సింధు మరోసారి ఎన్నికైంది. ఈ విషయాన్ని స్వయంగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించింది. పీవీ సింధుతోపాటు మరో ఐదుగురిని బ్యాడ్మింటన్ వరల్డ్ అథ్లెట్స్ కమిషన్ సభ్యులుగా నియమించినట్లు BWF ప్రకటించింది. ఈ ఆరుగురు 2025 వరకు కొనసాగనున్నట్లు తెలిపింది. Read Also: వైరల్: వధూవరుల డ్యాన్స్… మధ్యలో అనుకోని అతిధి రావడంతో… కొత్త నియామకం…
BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ పీవీ సింధు సత్తా చాటుతోంది. ఈ మేరకు గురువారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన పోర్న్‌పావీ చొచువాంగ్‌ను 21-14, 21-18 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 48 నిమిషాల పాటు జరిగిన రౌండ్-3 మ్యాచ్‌లో విజయం సాధించడంతో పీవీ సింధు క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. తదుపరి పోరులో తైవాన్ క్రీడాకారిణి తై జు యింగ్‌తో పీవీ సింధు తలపడనుంది. Read Also: కోహ్లీ చేసింది మంచి పని కాదు:…