టోక్యో ఒలింపిక్స్‌లో స్టార్ షట్లర్ సింధు శుభారంభం చేసింది. గ్రూప్-జె తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పోలికర్పోవాపై విజయం సాధించింది. 21-7, 21-10 తేడాతో సింధు గెలుపొందింది. అయితే గత ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన సింధు ఈ ఏడాది అలాగైనా గోల్డ్ సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇక మరోవైపు హైదరాబాదీ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా డబుల్స్ తొలి మ్యాచ్ ఈరోజు ఆడగా అందులో ఓటమిపాలైంది. సానియా మీర్జా, అంకిత రైనా ద్వయం..…
తెలుగు తేజం, బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధుకి అరుదైన గౌరవం దక్కనుంది. వచ్చేనెలలో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని భారత బృందాన్ని నడిపించే అవకాశం లభించనుంది. ఈ సారి బిన్నంగా పతాకాదారులుగా ఇద్దరిని ఎంపిక చేయనున్నారు. ఇద్దరు పతాకదారుల్లో సింధు ఒకరు అని భారత ఒలింపిక్ సంఘం వర్గాలు తెలిపాయి. దీనిపై ఈ నెలాఖారులోగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశంఉంది.
బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పీవీ సింధుకు విశాఖపట్నంలో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం.. విశాఖ రూరల్ చిన గదిలి గ్రామంలో ఆ రెండెకరాలు భూమి కేటాయించారు.. ఇక, చిన గదిలిలోని సింధుకు కేటాయించిన భూమిని పశు సంవర్ధకశాఖ నుంచి యువజన సర్వీసులు, క్రీడలకు బదలాయిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.. ఆ స్ధలంలో సింధూ బ్యాడ్మింటన్ అకాడెమీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు వెలువరిచింది.. భూమిని ఉచితంగా ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది సర్కార్.. కాగా,…