భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఈరోజు ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. అయితే పీవీ సింధు 2016 రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో సిల్వర్ పతకం గెలవగా.. ఈ ఏడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సింధుకు 2015లో పద్మశ్రీ అవార్డు దక్కింది. అయితే ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం…
డెన్మార్క్ ఓపెన్ నుంచి భారత స్టార్ బ్యాడ్మింటర్ ప్లేయర్ పీవీ సింధు నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో ఆమె కొరియాకు చెందిన సీడ్‌యన్ సియాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 11-21, 12-21 తేడాతో పోరాడి ఓటమి పాలైంది. దీంతో ఆమె సెమీస్‌కు వెళ్లకుండా ఇంటి దారి పట్టింది. ప్రి క్వార్టర్స్‌లో ఆమె 67 నిమిషాల పాటు పోరాడగా.. ఈ పోరులో మాత్రం ఆమె 36 నిమిషాలకే చేతులెత్తేసింది. Read Also: సూపర్-12లోకి…
రెండు సార్లు ఒలింపిక్స్ పతకం విజేత, భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు మరోసారి సత్తా చాటుతోంది. డెన్మార్క్ ఓపెన్‌లో ఆమె క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. రెండో రౌండ్‌కు సంబంధించి 67 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 21-16, 12-21, 21-15 తేడాతో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్‌పై పీవీ సింధు విజయకేతనం ఎగురవేసింది. ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన అనంతరం సింధుకు ఇది తొలి టోర్నమెంట్. మహిళల సింగిల్స్ పోటీల్లో పాల్గొంటున్న…
ఇటీవల తన రెండో ఒలంపిక్ పతకంతో రికార్డ్ క్రియేట్ చేసింది తెలుగమ్మాయి పి.వి. సింధు. గతంలో సింధు బయోపిక్ పలుమార్లు చర్చలోకి వచ్చింది. స్వయంగా పి.వి. సింధు తన బయోపిక్ లో నటించటానికి దీపికా పడుకొనే అయితే బాగుంటుందని కూడా చెప్పింది. ఇప్పుడు సింధు కోరిక నెరవేరబోతోంది. ఊహించినట్లుగానే దీపికా పదుకొనే సింధు పాత్రను పోషించటానికి రెడీ అవుతోంది. అంతే కాదు ఈ సినిమా దీపికనే స్వయంగా నిర్మించబోతోందట. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. బాడ్మింటన్…
మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో నిర్వహించిన పార్టీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం చిరంజీవి తన నివాసంలో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు కోసం పార్టీని ఏర్పాటు చేశారు. ఈ వీడియోను చిరు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. “దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన మన పివి సింధుని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది” అంటూ పీవీ సింధుకు సెల్యూట్…
ఒలింపిక్ పతాక విజేత పీవీ సింధుకు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఘనంగా సన్మానం జరిగింది. ఈ వేడుకకు అక్కినేని నాగార్జునతో పాటు రాధిక, సుహాసిని సహా మెగా కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై సింధును సన్మానించారు. ఈమేరకు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వీడియో షేర్ చేశారు. పీవీ సింధు ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.…
అనుమతి లేకుండా పీవీ సింధు ఫోటో ఉపయోగించినందుకు 20 కి పైగా బ్రాండ్‌లకు నోటీసులు పంపింది బేస్ లైన్ వెంచర్స్. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన సింధు ఇమేజ్‌ని వాడుకున్నట్లు ఆరోపణలు చేసారు. పలు బ్రాండ్లు ఒలింపిక్స్ మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించారని ఆరోపించింది. నిబంధనలను ఉల్లంఘించిన ప్రతి బ్రాండ్ నుండి 5 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని కోరుతూ లీగల్ నోటీస్ పంపారు. అధికారికంగా, IOC భాగస్వాములైన బ్రాండ్‌లు మాత్రమే, ఈ ఫోటోలు ఉపయోగించడానికి అనుమతించబడతాయి.…
ఒలింపిక్స్‌లో మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించిన పీవీ సింధు.. ఇవాళ సొంత గడ్డకు రానుంది. హైదరాబాద్‌లో అడుగుపెట్టనుంది. పతకాల సింధుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు అభిమానులు. అటు టోక్యో నుంచి ఢిల్లీకి చేరుకున్న సింధుకు మంత్రులు ఘన స్వాగతం పలికారు. దేశానికి వన్నె తెచ్చిన వనితను సాదరంగా సత్కరించారు. ఒలింపిక్‌లో కెరీర్లో ఒక్క మెడల్ కొడితే గొప్ప అనుకునే సమయంలో.. తెలుగు తేజం పీవీ సింధు వరుసగా రెండు పతకాలు సాధించింది. బ్యాడ్మింటన్‌లో గత ఒలింపిక్స్‌లో రజతం..…