Singapore Open: సెమీస్ చేరిన తెలుగు తేజం పీవీ సింధు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగపూర్ ఓపెన్‌లో తెలుగు తేజం పీవీ సింధు సత్తా చాటుతోంది. మహిళల సింగిల్స్‌లో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన పీవీ సింధు తాజాగా సెమీ ఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన హాన్ యూను 17-21, 21-11, 21-19 స్కోరుతో పీవీ సింధు మట్టి కరిపించింది. దీంతో టైటిల్ వేటకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. అటు ఈ సిరీస్‌లో మహిళల సింగిల్స్‌లో ఆదిలో సత్తా చాటిన మరో తెలుగు తేజం సైనా నెహ్వాల్ క్వార్టర్స్‌లోనే ఓటమిపాలైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన అయా ఒహోరి చేతిలో 13-21, 21-15, 20-22 స్కోరు తేడాతో సైనా నెహ్వాల్ ఓటమిపాలైంది.
Read Also: Viral Video: మాజీ సీఎం సిద్ధరామయ్యకు చేదు అనుభవం.. డబ్బులు విసిరికొట్టిన మహిళ
Also Read
- IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
- Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
ఈ ఓటమితో క్వార్టర్స్‌లోనే సైనా నెహ్వాల్ ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. తొలి సెట్‌లో ఓడినా రెండో సెట్‌లో పుంజుకున్న సైనా.. తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. రెండో సెట్‌లో ఆమె కొనసాగించిన జోరుతో వ్యూహం మార్చి ఆడిన ఒహోరి మూడో సెట్‌లో సైనాకు చెక్ పెట్టింది. దీంతో సైనాకు ఓటమి తప్పలేదు. 15 నెలల విరామం తర్వాత బ్యాడ్మింటన్ కోర్టులోకి అడుగుపెట్టిన సైనా.. రెండో రౌండ్‌లో చైనా ప్లేయర్ హి బింగ్ జియావోపై విజయం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ కూడా ఇంటి బాట పట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన కొడయ్ నరవోకా చేతిలో 21-12, 14-21, 18-21 స్కోరుతో ప్రణయ్ ఓటమిపాలయ్యాడు.
తాజావార్తలు
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!