PV Sindhu : భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కాస్త రూటు మార్చారు. ఆటతోనే కాకుండా తన డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేశారు. సాధారణంగా షటిల్ కోర్టులోనే కాకుండా బయట కూడా చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పుడూ చలాకీగా కనిపించే సింధు..ఈ కాలం అమ్మాయిలా ట్రెండ్ ను ఫాలో అవుతుంది. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండే ఈ తెలుగమ్మాయి తాజాగా ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్…
తెలుగు తేజం, కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణ విజేత పీవీ సింధు విజయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కామన్వెల్త్ గేమ్స్ 2022 చివరి రోజున భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అద్భుతం చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుని అంతర్జాతీయ క్రీడా వేదికపై మరోసారి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.
కామన్వెల్త్ క్రీడలు చివరి దశకు చేరుకున్నాయి. ఇవాళ్టితో ఆ క్రీడలు ముగియనుండగా.. భారత క్రీడాకారులు మాత్రం అదరగొడుతున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణం సాధించింది.కెనడాకు చెందిన మిచెల్ లీతో మహిళల సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.
Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్ ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో రేపు ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 8వ తేదీ వరకు (అంటే 12 రోజుల పాటు) జరగనున్నాయి. ఈ పోటీల్లోని 6 ఈవెంట్లలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12 మంది ప్రముఖ క్రీడాకారులు పాల్గొంటున్నారు.
సింగపూర్ ఓపెన్-2022 టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత షట్లర్ పీవీ సింధును ప్రధాని మోదీ అభినందించారు.భారత షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సింగపూర్ ఓపెన్ 2022 టైటిల్‌ను మహిళల సింగిల్స్ విభాగంలో చైనాకు చెందిన వాంగ్ జియీని ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. సింగపూర్ ఓపెన్-2022 విజేతగా నిలిచింది. ఆదివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్ ఫైనల్స్‌లో చైనా ప్లేయర్ వాంగ్ జి యీని 21-9, 11-21, 21-15 తేడాతో పీవీ సింధు ఓడించింది. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. ప్రారంభసెట్‌ను సింధు 12 నిమిషాల్లోనే ముగించింది. దీంతో 21-9తో తొలి సెట్‌ను సింధు గెలవగా రెండో సెట్‌ను 21-11 తేడాతో వాంగ్ జి యీ గెలిచింది. దీంతో మూడో సెట్లో…
సింగపూర్ ఓపెన్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అదరగొడుతోంది. శనివారం ఉదయం జరిగిన సెమీఫైనల్లో విజయం సాధించి ఆమె ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో జపాన్ ప్లేయర్ సీనా కవాకమీపై 21-15, 21-7 తేడాతో సింధు విజయం సాధించింది. సింధు ఈ మ్యాచ్‌ను కేవలం 32 నిమిషాల్లోనే ముగించింది. దీంతో టైటిల్‌కు ఇంకా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. సూపర్ 500 టోర్నీలో ఫైనల్ చేరడం ఈ ఏడాది పీవీ సింధుకు ఇదే మొదటిసారి. Read…