పారిస్ వేదికగా ఒలింపిక్స్-2024 క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్ ఆరంభరోజు భారత్‌కు చెందిన అథ్లెట్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. యువ షూటర్ మనుబాకర్ మాత్రం అదరగొట్టింది. 2020 ఒలింపిక్స్‌లో మూడు విభాగాల్లో పోటీ పడి ఈవెంట్‌లోనూ ఫైనల్ చేరకుండా నిరాశపరిచిన మనుబాకర్.. ఈ సారి అంచనాలను అందుకుంటూ పోటీ పడ్డ తొలి ఈవెంట్‌లోనే ఫైనల్ చేరి పతకం మీద ఆశలు రేపింది.
PV Sindhu about Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ధీమా వ్యక్తం చేశారు. బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర చాలా మెళకువలు నేర్చుకున్నానని చెప్పారు. తానేంతో మెరుగయ్యానని, తన ఆటను కోర్టులో చూస్తారని సింధు పేర్కొన్నారు. 2016 రియోలో రజతం, 2020 టోక్యోలో కాంస్య పతకాలను సింధు సాధించిన విషయం తెగెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌లోనూ పతకం గెలిచి.. ఒలింపిక్స్‌లో భారత్ తరఫున రికార్డు సృష్టించాలని…
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుండి ప్రారంభంకానున్నాయి. ఇందులో భారతదేశం నుండి మొత్తం 117 మంది క్రీడాకారులు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మొత్తం 7 పతకాలు సాధించింది. దింతో మరోసారి భారత జట్టు పతకాలు పెంచుకోవాలని భావిస్తోంది. పారిస్ ఒలింపిక్స్ సన్నాహకాల కోసం భారత ప్రభుత్వం మొత్తం రూ. 417 కోట్లు వెచ్చించింది. ఇందుకు సంబంధించి వివరాలను ఓసారి పరిశీలిద్దాం. Broccoli: లైంగిక…
Sharath Kamal as India’s Flag Bearer in Paris Olympics: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పతాకధారిగా వ్యవహరించనున్నారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తెలుగమ్మాయి సింధు.. పారిస్ ఒలింపిక్స్‌లో త్రివర్ణ పతాకాన్ని చేబూని భారత బృందాన్ని నడిపించనున్నారు. రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలను సింధు గెలిచిన విషయం తెలిసిందే. పురుషుల తరఫున టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరించనున్నారు. హైదరాబాదీ…
డబుల్ ఒలింపిక్ పతక విజేత PV సింధు మలేషియా మాస్టర్స్ 2024 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్ జియితో ఓడిపోయింది. భారత షట్లర్ తొలి గేమ్‌లో 21-16 తేడాతో ఫైనల్‌ను ప్రారంభించింది. చైనా షట్లర్ రెండో స్థానంలో పునరాగమనం చేసి 21-5తో విజయం సాధించింది. చివరి గేమ్‌లో సింధు ఆధిపత్య ధోరణిని ప్రదర్శించి 11-3తో ఆధిక్యంలో నిలిచింది. అయినప్పటికీ, వాంగ్ తన నరాలను పట్టుకుని స్టైల్‌గా పుంజుకుంది మరియు 16-21తో గేమ్‌ను కైవసం చేసుకుంది.…
PV Sindhu sail into Asian Games 2023 Badminton quarters: చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023 బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం ఉదయం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సింధు 21–16, 21–16తో పుత్రి కుసుమ వర్దాని (ఇండోనేసియా)పై అద్భుత విజయం సాధించింది. రెండు సెట్లలో వర్దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇక రజత పతకాన్ని ఖాయం చేసేందుకు తెలుగు తేజం సింధు…
ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణాలు సహా 69 పతకాలు సాధించింది. ఆసియా క్రీడల 11వ రోజు అనగా.. అక్టోబర్ 4న భారత్ ఆశలు పెట్టుకున్న బల్లెం వీరుడు నీరజ్ చోప్రా స్వర్ణం కోసం పోటీ పడనున్నాడు.
రెండుసార్లు ఒలింపిక్ విజేత పివి సింధు గురువారం ఇండోనేషియా ఓపెన్ 2023 నుంచి చైనీస్ తైపీకి చెందిన తాయ్ జు-యింగ్‌తో వరుస గేమ్‌లలో ఓడిపోయి నిష్క్రమించింది. రౌండ్ ఆఫ్ 16లో తాయ్ జు యింగ్‌పై సింధు 18-21, 16-21 తేడాతో పరాజయం పాలైంది.
బాసెల్‌లో జరుగుతున్న స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్ ఫైనలిస్ట్ చైనాకు చెందిన షి యు క్విని ఓడించి పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్‌ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు.