PV Sindhu: ఆ అన్యాయంపై కమిటీ క్షమాపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిఫరీ చేసిన తప్పిదం వల్ల బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌సిప్ టోర్నీలో ఓటమి పాలైన పివి సింధుకి తాజాగా కమిటీ క్షమాపణలు చెప్పింది. ఆ మానవ తప్పిదానికి సారీ చెప్తున్నామని, ఇలాంటి పొరబాట్లు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ ఛైర్మన్ చిహ్ షెన్ చెన్ తెలిపారు. ‘‘ఆసియా ఛాంపియన్‌షిప్‌లో మీకు (పీవీ సింధు) కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్తున్నాం. ఇప్పుడు ఆ పొరబాటుని సరిదిద్దే అవకాశం లేదు. అయితే, భవిష్యత్తులో ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఇదంతా ఆటల్లో ఓ భాగమేనని, దాన్ని మీరు అంగీకరిస్తారని విశ్వసిస్తున్నాం’’ అని ఛైర్మన్ లేఖలో పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే.. ఏప్రిల్‌లో జరిగిన ఆ టోర్నీలో భాగంగా సెమీ ఫైనల్‌లో అకానె యమగూచితో తలపడుతున్నప్పుడు రిఫరీ ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. తొలి గేమ్ సొంతం చేసుకున్న సింధూ.. రెండో గేమ్‌లో 14-11తో ఆధిపత్యంలో దూసుకుపోతున్నప్పుడు సర్వీస్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుందన్న కారణంతో యమగూచికి ఒక పాయింట్ ఫ్రీగా కేటాయించాడు. దీంతో స్కోర్ 14-12గా మారింది. యమగూచి సిద్ధంగా లేకపోవడం వల్లే తాను సమయం తీసుకున్నానని సింధు వివరించే ప్రయత్నం చేసినా.. రిఫరీ వినిపించుకోకుండా ప్రత్యర్థికి పాయింట్ ఇచ్చేశాడు. దాని తర్వాత యమగూచి మ్యాచ్‌పై పట్టు సాధించి, 19-21 తేడాతో గేమ్ సొంతంచేసుకుంది. మూడో గేమ్ కూడా 16-21తో గెలవడంతో.. మ్యాచ్ సింధు చేజారింది.
Also Read
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
రిఫరీ చేసిన ఆ తప్పిదంపై అప్పుడే సింధు ఆసియా బ్యాడ్మింటన్ ఫెడరేషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలోనే తనకు అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన ప్రత్యర్థికి ఆ పాయింట్ ఇవ్వకపోయి ఉంటే, తాను విజయానికి చేరువయ్యేదానినని తెలిపింది. అనవసరంగా పాయింట్ కోల్పోవడంతో 14-12గా స్కోరు మారిందని తెలిపింది. దీనిపై విచారించిన కమిటీ.. రిఫరీ తప్పిదానికి సారీ చెప్పింది.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!