పీవీ సింధూ… సైనా నెహ్వాల్… ఆటలో ఇద్దరూ ఇద్దరే. బ్యాడ్మింటన్‌లో భారత కీర్తిపతాకాన్ని ప్రపంచస్థాయిలో రెపరెపలాడించినవారే. కాకపోతే, సైనా సీనియర్.. పీవీ సింధూ కాస్త జూనియర్. అయితే, వీళ్లిద్దరి మధ్యా అగాథం ఏర్పడిందా? ఇద్దరూ మాట్లాడుకోవడం లేదా? టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలించిన పీవీ సింధుకు.. మాజీ కోచ్ గోపీచంద్ సహా ఎంతోమంది ప్రముఖులు అభినందనలు తెలిపారు. మరి సైనా నెహ్వాల్ ఎందుకు.. సింధూని విష్ చేయలేదు. ఇప్పుడు భారత క్రీడాభిమానులు ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. ఈ…
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సింధూ.. కోచ్‌ను మార్చడంపై తాజాగా మరోసారి స్పష్టతనిచ్చింది. ఏడాదిన్నరగా పార్క్ శిక్షణ ఇస్తున్నాడనీ… భవిష్యత్తులోనూ అతని ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగిస్తాననీ తేల్చి చెప్పింది. గోపీచంద్ అకాడమీని వీడి గచ్చిబౌలి స్టేడియంలో సాధన చేయడంలో వివాదమేమీ లేదన్న సింధూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులో ఉన్న స్టేడియం వసతుల్ని ఉపయోగించుకున్నానని చెప్పింది. ఫిబ్రవరి నుంచి అక్కడే సాధన చేస్తున్నాననీ… ఆ స్టేడియంలో ఆడటం టోక్యోలో ఎంతగానో ఉపయోగపడిందని తెలిపింది సింధు. టోక్యోలో కాంస్యం గెలిచాక…
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధుకు ఏపీ నగదు బహుమానం ప్రకటించింది. ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో ప్రతిభ చాటుకున్న రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిందన్న సీఎం… ఈ విజయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతిభ చాటుతున్న రాష్ట్ర క్రీడాకారులందరికీ కూడా ప్రభుత్వం తగిన రీతిలో ప్రోత్సహిస్తుందన్నారు సీఎం. పీవీ సింధుకు ఇటీవలే…
టోక్యో ఒలింపిక్స్ 2021లో హైదరాబాద్‌కు చెందిన భారతీయ షట్లర్ పివి సింధు కాంస్య పతకం సాధించింది. ఆమె చైనాకు చెందిన హి బింగ్జియావోను 2 వరుస సెట్లలో ఓడించింది. సింధు ఇప్పుడు వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు సాధించిన రెండవ భారతీయ అథ్లెట్. ఈ మ్యాచ్‌లో విజయంతో ఆమె అరుదైన ఘనతను సాధించింది. కాంస్య మ్యాచ్‌లో సింధు చారిత్రాత్మక విజయం సాధించినందుకు అభినందన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. “సింధు అద్భుతమైన విజయంతో మేమంతా ఉల్లాసంగా ఉన్నాము. టోక్యో 2020లో…
టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కు రెండో మెడల్ వచ్చింది. భారత క్రీడాకారిణి పీవీ సింధూ సింగిల్స్ బ్యాడ్మింటన్ లో కాంస్య పతకం సాధించింది వరుస ఒలంపిక్స్ లో మెడల్స్ సాధించిన క్రీడాకారిణిగా నిలిచింది. అయితే నిన్న సెమీస్‌లో చైనా ప్లేయర్ తైజుయింగ్ చేతిలో ఓడిన సింధూ.. ఇవాళ మరో చైనీస్ క్రీడాకారిణి బింగ్జియావోతో తలపడింది. ఈ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ కాంస్య పతక పోరులో బింగ్జియావో ను 21-13, 21-15 తో వరుస సెట్లలో ఓడించి…
టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ లో చైనా కి చెందిన వరల్డ్ నెంబర్ వన్ తైజుయింగ్ చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ ప్రారంభ సమయం నుండి తీవ్ర ఒత్తిడిలో ఆడింది సింధూ. ఔట్ ఆఫ్ ది లైన్ కొడుతూ… పాయింట్స్ ను చేజార్చుకుంది. దాంతో పీవీ సింధుకు 18-21,12-21 తో వరుస సెట్లలో ఓడిపోయింది. ఇక గత ఒలింపిక్స్ లో సింధూ చేతిలో ఒడిన తైపీ…
టోక్యో ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది తెలుగు తేజం పీవీ సింధు… శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి, నాలుగో సీడ్ అకానా యమగూచిపై విజయం సాధించి సెమీస్‌లో ప్రవేశించారు.. తద్వారా ఓ అరుదైన రికార్డును కూడా సాధించగారు.. వరుసగా రెండుసార్లు ఒలిపింక్స్‌లో సెమీ ఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణి, షట్లర్‌గా పీవీ సింధు రికార్డు సృష్టించారు.. అయితే, ఇవాళ జరగనున్న సెమీస్ సింధుకు కఠిన సవాల్ గా చెప్పాలి.. ఎందుకుంటే వరల్డ్ నెంబర్…
టోక్యో ఒలంపిక్స్ లో భారత క్రీడాకారిణి పీవీ సింధూ జైత్రయాత్ర కొనసాగుతుంది. నేడు బ్యాడ్మింటన్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జపాన్ ప్లేయర్ యమగూచీపై విజయం సాధించి సెమీస్ లో అడుగు పెట్టింది పీవీ సింధూ. అయితే మ్యాచ్ ప్రారంభ సమయం నుండి జపాన్ ప్లేయర్ పైన తన ఆధిపత్యం చూపిస్తూ వచ్చింది. వరసగా రెండు సెట్లు 21- 13, 22-20 తో కైవసం చేసుకున్న పీవీ సింధూ విజయాన్ని ఖాతాలో వేసుకొని ఫైనల్ 4 లోకి ఎంట్రీ…
టోక్యో ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది తెలుగుతేజం, భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు… మహిళ సింగిల్స్ గ్రూప్-జేలో వరుసగా మూడు విజయాన్ని సాధించిన ఆమె.. క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది… ఇవాళ జరిగిన ప్రీక్వార్టర్స్‌లో డెన్మార్క్ షెట్లర్ మియా బ్లిక్‌ఫెల్ట్ పై వరుస సెట్లలో విజయం సాధించారు సింధూ.. 21-15, 21-13తో ప్రత్యర్థిని చిత్తు చేసిన ఆమె.. వరుస విజయాలతో గ్రూప్-జేలో అగ్రస్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది… మరో విజయం సాధిస్తే కాంస్యం పతకం సాధించడం…