PV Sindhu : ‘జిగిల్ జిగేల్’ అనిపిస్తోన్న పీవీ సింధూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PV Sindhu : భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కాస్త రూటు మార్చారు. ఆటతోనే కాకుండా తన డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేశారు. సాధారణంగా షటిల్ కోర్టులోనే కాకుండా బయట కూడా చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పుడూ చలాకీగా కనిపించే సింధు..ఈ కాలం అమ్మాయిలా ట్రెండ్ ను ఫాలో అవుతుంది. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండే ఈ తెలుగమ్మాయి తాజాగా ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇందులో పాపులర్ సాంగ్ ‘జిగిల్ జిగిల్’లో పాటకు డ్యాన్స్ చేసింది. చీర కట్టుకున్న సింధు పాటకు తగ్గట్టు అద్భుతమైన స్టెప్పులతో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడీ వీడియో నెట్ లో వైరల్ అయింది. సింధు స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సింధుకు డ్యాన్స్ అంటే ఇష్టం.
ఇది వరకు కూడా ఇలాంటి వీడియోలను తను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. గత వారం జాతీయ క్రీడల ప్రారంభ వేడుకుల కోసం గుజరాత్ వెళ్లిన సింధు.. గుజరాతీ బట్టలు ధరించి సంప్రదాయ గార్బా డ్యాన్స్ చేసింది. ఆగస్టులో కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం కైవసం చేసుకున్న సింధు చిన్న గాయం కారణంగా కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ నుంచి వైదొలిగింది. తొందర్లోనే తిరిగి బ్యాడ్మింటన్ కోర్టులోకి రావాలని చూస్తోంది. డిసెంబర్ లో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ లో పాల్గొనేందుకు సింధు సిద్ధం అవుతోంది.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..