PM Narendra Modi: సింగపూర్ ఓపెన్ టైటిల్ విజేత పీవీ సింధుకు ప్రధాని అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: సింగపూర్ ఓపెన్-2022 టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత షట్లర్ పీవీ సింధును ప్రధాని మోదీ అభినందించారు.భారత షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సింగపూర్ ఓపెన్ 2022 టైటిల్‌ను మహిళల సింగిల్స్ విభాగంలో చైనాకు చెందిన వాంగ్ జియీని ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. “తొలిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నందుకు పీవీ సింధును అభినందిస్తున్నాను. ఆమె మరోసారి తన అసాధారణమైన క్రీడా ప్రతిభను ప్రదర్శించి విజయం సాధించింది. ఇది దేశానికి గర్వకారణం, రాబోయే క్రీడాకారులకు కూడా స్ఫూర్తినిస్తుంది” అని ప్రధాని ట్వీట్ చేశారు.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. సింగపూర్ ఓపెన్-2022 విజేతగా నిలిచింది. ఆదివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్ ఫైనల్స్‌లో చైనా ప్లేయర్ వాంగ్ జి యీని 21-9, 11-21, 21-15 తేడాతో పీవీ సింధు ఓడించింది. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. ప్రారంభసెట్‌ను సింధు 12 నిమిషాల్లోనే ముగించింది. దీంతో 21-9తో తొలి సెట్‌ను సింధు గెలవగా రెండో సెట్‌ను 21-11 తేడాతో వాంగ్ జి యీ గెలిచింది. డిసైడర్ గేమ్‌లో అగ్రశ్రేణి భారత షట్లర్ 21-15తో విజయం సాధించి తొలిసారిగా సింగపూర్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ ఏడాది పీవీ సింధుకు ఇది మూడో టైటిల్. ఇప్పటికే 2022లో ఆమె కొరియా ఓపెన్, స్విస్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Also Read
- Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
- BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
- India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
Singapore Open: చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. తొలిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్ కైవసం
సింగపూర్ ఓపెన్ 2022 మహిళల సింగిల్స్ విభాగంలో శనివారం ఇక్కడ సింగపూర్‌లో జరిగిన సెమీఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన సైనా కవాకమిని ఓడించి పీవీ సింధు శిఖరాగ్ర పోరుకు చేరుకుంది. సింధు 15-21, 7-21తో రెండు వరుస గేమ్‌లలో జపాన్ క్రీడాకారిణిపై అధిగమించి ఆధిపత్యం సాధించింది. ఈ మ్యాచ్ 58 నిమిషాల పాటు సాగింది.
I congratulate @Pvsindhu1 on winning her first ever Singapore Open title. She has yet again demonstrated her exceptional sporting talent and achieved success. It is a proud moment for the country and will also give inspiration to upcoming players. https://t.co/VS8sSU7xdn
— Narendra Modi (@narendramodi) July 17, 2022
తాజావార్తలు
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!