PV Sindhu Knocked Out In First Round Of All England Championships: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో.. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, రెండుసార్లు ఒలంపిక్ మెడలిస్ట్ అయిన పీవీ సింధుకు చేదు అనుభవం ఎదురైంది. తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. చైనాకుకు చెందిన వైఎమ్ ఝాంగ్ చేతిలో ఓటమి పాలైంది. 39 నిమిషాల పాటు సాగిన ఈ గేమ్‌లో పీవీ సింధు కనీసం పోరాడలేక.. 21-17, 21-11 వరుస గేముల్లో చిత్తయ్యింది.
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్.. షెడ్యూల్ ఇదే!
ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ప్రత్యర్థి ఎటాకింగ్ మోడ్‌లో తన ఆటను కొనసాగించగా.. పీవీ సింధు మాత్రం డీలాగా రాణించింది. ఈ దెబ్బకు ఈ టోర్నీ నుంచి తొలి రౌండ్‌లోనే వైదొలగాల్సి వచ్చింది. తొలి రౌండ్‌లోనే పీవీ సింధు ఇలా ఇంటిదారి పట్టడం ఇది మూడోసారి. ఇంతకముందు మలేషియా ఓపెన్‌లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్ చేతిలో తొలి రౌండ్‌లో పివి సింధు చిత్తుగా ఓడింది. అనంతరం ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలోనూ తొలి రౌండ్‌లోనే చేతులు ఎత్తేసింది. ఒకప్పుడు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన తెలుగుతేజం.. ఇప్పుడు తొలి రౌండ్లలనో చేతులు ఎత్తేస్తుండటంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఆటతీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. పీవీ సింధు పని ఇక అయిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.
H3N2 Virus: మహారాష్ట్రలో హెచ్3ఎన్2 కలకలం.. ఇద్దరు మరణించినట్లు ప్రభుత్వం వెల్లడి
మరోవైపు.. బుధవారం జరిగిన మహిళల డబుల్స్‌లో భారత జోడి త్రీసా జోలీ, గాయత్రి గోపిచంద్ పుల్లెల.. థాయ్‌లాండ్‌కు చెందిన జోంగ్‌కోల్పన్ కితిరాకుల్, రావిండా ప్రజొగ్జాంయ్‌లకు ఊహించని షాక్ ఇచ్చారు. తొలి రౌండ్ మ్యాచ్‌లో వారిని 21-18, 21-14 తేడాతో మట్టికరిపించి.. త్రీసా, గాయత్రి ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఇక పురుషుల సింగిల్స్ విషయానికొస్తే.. లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణోయ్‌లు తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, రెండో రౌండ్‌కు చేరుకున్నారు.