Putin signs decree banning oil exports to EU countries: ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. ఈ యుద్ధ నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య దేశాలు అనేక ఆంక్షలు విధించాయి. దీనికి ప్రతిగా రష్యా కూడా అదే స్థాయిలో స్పందిస్తోంది. ఇటీవల యూరోపియన్ యూనియన్ దేశాలు, ఆస్ట్రేలియాలు రష్యా ముడిచమురుపై ప్రైస్ క్యాప్ విధించాయి. ఈ నిర్ణయాన్ని రష్యా తీవ్రంగా తప్పుపట్టింది. పశ్చిమ దేశాల మూర్ఖపు చర్యగా దీన్ని రష్యా ఘాటలుగా స్పందించింది.
Russia-Ukraine War: పది నెలలు గడుస్తున్నా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ అమెరికా పర్యటనకు వెళ్లి ఆయుధాలు, ఆర్థిక సాయం గురించి చర్చించారు. దీంతో ఇప్పట్లో ఉక్రెయిన్ కు యుద్ధం ఆపాలనే ఉద్దేశం లేనట్లుగా తెలుస్తోంది. ఇక రష్యా చర్చలకు సిద్ధం అని ప్రకటిస్తున్నా.. పుతిన్ గద్దె దిగితేనే చర్చలంటూ ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. ఉక్రెయిన్ ను ముందుపెట్టి అమెరికా, వెస్ట్రన్ దేశాలు తమపై పరోక్ష యుద్ధం…
Vladimir Putin Says West Wants To "Tear Apart" Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి 10 నెలలు పూర్తయ్యాయి. అయినా ఇప్పడప్పుడే యుద్ధం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. వెస్ట్రన్ దేశాలు రష్యాను విచ్ఛిన్నం చేయడాని ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని సమర్థించారు పుతిన్. ఇది రష్యన్లను ఏకం చేయడానికే అని అన్నారు. ఉక్రెయిన్లు కూడా రష్యన్లే అని ఆయన అన్నారు.
Russia accuses USA of being at an indirect war: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్స్కీ అమెరికా పర్యటనపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య మరింతగా ఉద్రిక్తతలు పెంచేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపిస్తోంది. జెలన్స్కీ పర్యటనతో రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇక చర్చల అంశం ప్రస్తావనకు రానే రాదని రష్యా స్పష్టం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభమైన యుద్ధం 10 నెలలుగా సాగుతోంది. అయితే తొలిసారి ఉక్రెయిన్…
Russia's Zircon Hypersonic Missile: ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. మరోవైపు తన దేశం సర్వనాశనం అవుతున్నా..ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ యుద్ధాన్ని ఆపి, రష్యాతో చర్చలకు వెళ్లేందుకు సుముఖత చూపించడం లేదు. మరన్ని ఆయుధాలు కావాలంటూ అమెరికా పర్యటనకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. రష్యా అమ్ముల పొదిలో అధునాతన క్షిపణి చేరినట్లు వెల్లడించారు. దీనికి ప్రపంచంలో సాటి…
Russia Says No Chance Of Peace Talks As Zelenskiy Travels To Washington: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ బుధవారం అమెరికాలో పర్యటించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ కావడంతో పాటు కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే జెలన్ స్కీ అమెరికా పర్యటనపై రష్యా తీవ్రంగా స్పందించింది. బుధవారం జెలన్ స్కీ వాషింగ్టన్ పర్యటన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. ఉక్రెయిన్…
Russian Strikes Across Ukraine: ఉక్రెయిన్ పై భారీస్థాయిలో క్షిపణులతో విరుచుకుపడుతోంది రష్యా. రాజధాని కీవ్ తో సహా దక్షిణాన ఉన్న క్రైవీ రిహ్, ఈశాన్యంలో ఉన్న ఖార్కీవ్ నగరాలపై దాడులు చేస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభించింది రష్యా. ముఖ్యంగా ఈ నగరాల్లోని మౌళిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది. రష్యా దాడుల వల్ల ఖార్కీవ్ నగరంలో విద్యుత్ లేకుండా పోయింది. ఖార్కీవ్ లోొ మూడు దాడులు మౌళిక సదుపాయలే…
PM Modi, Russian President Vladimir Putin speak on phone: భారత్, రష్యా మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఇరు నేతలు రెండు దేశాల దౌత్య సంబంధాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై సంభాషించినట్లు పీఎంఓ తెలిపింది. ఉక్రెయిన్ తో యుద్ధంలో దౌత్యమే ఏకైక మార్గమని ప్రధాని మోదీ పుతిన్ కు పునరుద్ఘాటించారని వెల్లడించింది. పుతిన్, మోదీతో మాట్లాడినట్లు క్రెమ్లిన్ వర్గాలు కూడా ధృవీకరించాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొద్ది రోజులుగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారి పడిపోయారని అంతర్జాతీయ మీడియాలు పేర్కొన్నాయి.
Zelensky Slams Elon Musk's Russia Peace Plan: ఉక్రెయిన్ దాడిని ఆపాలంటూ రష్యాకు సూచిస్తూ కొన్ని ప్రతిపాదనలు చేశారు అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్. అయితే మస్క్ చేసిన ప్రతిపాదనలపై మండి పడ్డారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ. బుధవారం న్యూయార్క్ టైమ్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో జెలన్ స్కీ మాట్లాడుతూ.. ఎలాన్ మస్క్ ప్రతిపాదనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు యుద్ధ పరిస్థితి తెలియాలంటే ఉక్రెయిన్ వచ్చి చూడాలని సూచించారు. రష్యా, ఉక్రెయిన్ లో…