There Will Be No Third World War Says zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ మంగళవారం గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రధానోత్సవంలో వర్చువల్ గా ప్రసంగించారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి ప్రపంచ యుద్దంలో మిలియన్ల మంది, రెండో ప్రపంచ యుద్ధంలో పది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని..అయితే మూడో ప్రపంచ యుద్ధం ఉందని ఆయన అన్నారు. స్వేచ్ఛా ప్రపంచం సహాయంతో రష్యా దురాక్రమణను ఉక్రెయిన్ ఆపుతుందని అన్నారు.
Putin Says Ready For Talks With Ukraine: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడాలని ప్రపంచదేశాలు కాంక్షిస్తున్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య మాత్రం యుద్ధం ఆగడం లేదు. రష్యా దాడులతో ఉక్రెయిన్ సర్వనాశనం అవుతోంది. ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ చర్చలకు సిద్ధం అని ఎలాంటి సంకేతాలు పంపడం లేదు. ఇదిలా ఉంటే రష్యా మాత్రం ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధం అని పలుమార్లు ప్రకటించింది. అయితే రష్యా అధ్యక్షుడిగా పుతిన్…
Russia-Ukraine War: న్యూ ఇయర్ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత రష్యా ఆక్రమిత డోనెట్స్క్ ప్రాంతంపై ఉక్రెయిన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 400 మంది రష్యన్ సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ పేర్కొంది.
Russian air attack on Ukraine: కొత్త ఏడాదిలో రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. మిసైళ్లు, ఇరాన్ తయారీ కామికేజ్ డ్రోన్లతో దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై సోమవారం తెల్లవారుజామున వరసగా దాడులు చేస్తోంది రష్యా. దీంతో ఉక్రెయిన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. నగరంలోని పౌరులను అలర్ట్ చేసింది ఉక్రెయిన్ ప్రభుత్వం. కీవ్ పై వైమానిక దాడి..రాజధానిలో ఎయిర్ అలర్ట్ ఆన్ లో ఉందని టెలిగ్రామ్ లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు షెల్టర్…
Ukraine Will Fight Russia Until Victory says Zelensky In New Year Address: ఉక్రెయిన్ విజయం సాధించే వరకు రష్యాతో పోరాడుతూనే ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలన్ స్కీ ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యుద్ధంలో పాల్గొని మరణించిన ఉక్రెయిన్ సైనికులకు నివాళులు అర్పించారు. ‘‘మేము విజయం కోసం పోరాడుతాం.. పోరాడుతూనే ఉంటాం’’ అంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు. రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడులు నిర్వహించిన కొన్ని…
Russia accuses US of plot to eliminate Vladimir Putin to end Ukraine war: ఉక్రెయిన్-రష్యా యుద్ధం పదో నెలకు చేరుకుంది. అయినా ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడప్పుడే శాంతి నెలకొనే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ మరింతగా ఆయుధ సహాయం, ఆర్థిక సహాయాన్ని పొందేందుకు అమెరికాలో పర్యటించారు. అమెరికా నుంచి పెట్రియాడ్ క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్ కోరుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే కారణం అంటూ రష్యా…
Putin signs decree banning oil exports to EU countries: ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. ఈ యుద్ధ నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య దేశాలు అనేక ఆంక్షలు విధించాయి. దీనికి ప్రతిగా రష్యా కూడా అదే స్థాయిలో స్పందిస్తోంది. ఇటీవల యూరోపియన్ యూనియన్ దేశాలు, ఆస్ట్రేలియాలు రష్యా ముడిచమురుపై ప్రైస్ క్యాప్ విధించాయి. ఈ నిర్ణయాన్ని రష్యా తీవ్రంగా తప్పుపట్టింది. పశ్చిమ దేశాల మూర్ఖపు చర్యగా దీన్ని రష్యా ఘాటలుగా స్పందించింది.
Russia-Ukraine War: పది నెలలు గడుస్తున్నా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ అమెరికా పర్యటనకు వెళ్లి ఆయుధాలు, ఆర్థిక సాయం గురించి చర్చించారు. దీంతో ఇప్పట్లో ఉక్రెయిన్ కు యుద్ధం ఆపాలనే ఉద్దేశం లేనట్లుగా తెలుస్తోంది. ఇక రష్యా చర్చలకు సిద్ధం అని ప్రకటిస్తున్నా.. పుతిన్ గద్దె దిగితేనే చర్చలంటూ ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. ఉక్రెయిన్ ను ముందుపెట్టి అమెరికా, వెస్ట్రన్ దేశాలు తమపై పరోక్ష యుద్ధం…
Vladimir Putin Says West Wants To "Tear Apart" Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి 10 నెలలు పూర్తయ్యాయి. అయినా ఇప్పడప్పుడే యుద్ధం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. వెస్ట్రన్ దేశాలు రష్యాను విచ్ఛిన్నం చేయడాని ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని సమర్థించారు పుతిన్. ఇది రష్యన్లను ఏకం చేయడానికే అని అన్నారు. ఉక్రెయిన్లు కూడా రష్యన్లే అని ఆయన అన్నారు.
Russia accuses USA of being at an indirect war: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్స్కీ అమెరికా పర్యటనపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య మరింతగా ఉద్రిక్తతలు పెంచేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపిస్తోంది. జెలన్స్కీ పర్యటనతో రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇక చర్చల అంశం ప్రస్తావనకు రానే రాదని రష్యా స్పష్టం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభమైన యుద్ధం 10 నెలలుగా సాగుతోంది. అయితే తొలిసారి ఉక్రెయిన్…