Putin signs decree banning oil exports to EU countries: ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. ఈ యుద్ధ నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య దేశాలు అనేక ఆంక్షలు విధించాయి. దీనికి ప్రతిగా రష్యా కూడా అదే స్థాయిలో స్పందిస్తోంది. ఇటీవల యూరోపియన్ యూనియన్ దేశాలు, ఆస్ట్రేలియాలు రష్యా ముడిచమురుపై ప్రైస్ క్యాప్ విధించాయి. ఈ నిర్ణయాన్ని రష్యా తీవ్రంగా తప్పుపట్టింది. పశ్చిమ దేశాల మూర్ఖపు చర్యగా దీన్ని రష్యా ఘాటలుగా స్పందించింది.
ఇదిలా ఉంటే రష్యా కూడా ఈ నిర్ణయానికి ధీటుగా స్పందించింది. యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలకు ముడిచమురు ఎగుమతులపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఎగుమతులను నిషేధిస్తూ డిక్రీపై సంతకం చేశారు. ఫిబ్రవరి 1, 2023 నుంచి ఇది అమలులోకి రానుంది. జూలై 1, 2023 వరకు ఇది వర్తించనుంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నిషేధాన్ని అధిగమించేందుకు పుతిన్ కు అధికారులు కట్టబెట్టింది.
Read Also: Philippines: ఫిలిప్పీన్స్‌లో భారీగా వరదలు.. 13 మంది మృతి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికాతో పలు యూరప్ దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. అయితే ఈ నిర్ణయం వల్ల రష్యాపై పెద్దగా ప్రభావం చూపలేదు. దీని ఫలితంగా పలు యూరప్ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చాలా దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఇదిలా ఉంటే ఇటీవల ఈయూ, రష్యా చమురు పై ధర పరిమితిని విధించింది. బ్యారెల్ ఫ్రైజ్ 60 డాలర్లకు పరిమితం చేసింది. దీని కన్నా ఎక్కువ ధరతో ఏ దేశమైనా కొనుగులు చేస్తే వారిపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. అయితే ఇలా చేయడాన్ని రష్యా తీవ్రంగా తప్పుబట్టింది. తాజాగా రష్యా, ఈయూకు చమురు ఎగుమతును నిషేధించింది.
ఇదిలా ఉంటే రష్యా నిర్ణయంతో రాబోయే రోజుల్లో యూరప్ లో సంక్షోభం తప్పకపోవచ్చు. యూరప్ దేశాలు చమురు కోసం భారీగా రష్యాపై ఆధారపడ్డాయి. ఇప్పటికే బ్రిటన్ వంటి దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. తాజా నిర్ణయం వల్ల ఈయూ దేశాలు ఇతర ప్రాంతాల నుంచి చమురు కొనుగోలు చేయాలంటే చాలా డబ్బును వెచ్చించాల్సి ఉంటుంది. ఫలితంగా ఆయా దేశాలు ఖజనాపై భారీగా ప్రభావం పడే అవకాశం ఉంది.