Putin: రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ తన ప్రేయసి అలీనా కుబేవాతో రహస్యం జీవిస్తున్నాడా..? అంటై ఔననే అంటున్నాయి కొన్ని నివేదికలు. పుతిన్ తన 39ఏళ్ల ప్రేయసితో కలిసి రాజధాని మాస్కోకు వాయువ్యంగా ఉన్న ప్రాంతంలో విలాసవంతమైన ఎస్టేట్ లో రహస్యం నివసిస్తున్నట్లు ది ప్రాజెక్ట్ నివేదించింది. దాదాపుగా 120 మిలియన్ డాలర్లు( రూ.990 కోట్లు) విలువైన ఎస్టేట్ లో ఉన్నారు. పుతిన్ ప్రేయసి అలీనా కుబేవాతో పాటు వారి ముగ్గురు పిల్లలు కూడా అక్కడే ఉన్నారని తెలుస్తోంది.
Read Also: PM Narendra Modi: ఈశాన్య రాష్ట్రాలు ఢిల్లీ నుంచి , మా దిల్ నుంచి దూరం కాలేవు..
2020లో ప్రారంభం అయిన ఈ ఎస్టేట్ కేవలం రెండేళ్లలో పూర్తయింది. ఈ భవనం దాదాపుగా 13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. రష్యాన్ డాచా శైలిలో కలపతో నిర్మించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు భవన నిర్మాణంలో బంగారాన్ని కూడా వాడినట్లు సమాచారం. ప్రస్తుత ఈ ఎస్టేట్ మాస్కోకు 400 కిలోమీటర్ల దూరంలో వాల్దాయ్ సరస్సుకు దగ్గర్లో ఉంది. పుతిన్-అలీనా పిల్లలు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. సైప్రస్ నుంచి వచ్చిన అక్రమ నిధులతో ఈ విలాస భవనాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ నిధుల నుంచి అలీనాతో పాటు ఆమె బంధువులు కూడా లబ్ధి పొందుతున్నారని నివేదిక పేర్కొంది.
జిమ్నాస్ట్, ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన అలీనా కుబేవా, పుతిన్ తో చాలా ఏళ్లుగా రిలేషన్ లో ఉంది. గతంలో రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ బృందం ఈ భవనం గురించి ప్రస్తావించారు. మొదటిసారిగా 2021లో జైలులో ఉన్న సమయంలోనే దీని గురించి నివేదించారు. దీన్ని నిర్మించేందుకు బడ్జెట్ నిధులను ఉపయోగించారనే ఆరోపణలు కూడా వచ్చాయి.