Donald Trump: అమెరికాలో వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ నేత డొనాల్డ్ ట్రంప్ పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ నుంచి ఆయన జూనియర్ నిక్కీ హేలి ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్దం ఆపేసత్తా నాకే ఉందని ఆయన అన్నారు. అధ్యక్షుడు జో బైడెన్ రష్యాను చైనా చేతుల్లో పెట్టారని విమర్శించారు.
Read Also: Umesh Pal Case: హత్య కేసులో మరో నిందితుడిని ఎన్‌కౌంటర్‌లో లేపేసిన యోగీ సర్కార్..
సోమవారం ఆయోవాలోని డావెన్‌పోర్ట్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో ట్రంప్ ఈ విషయం చెప్పారు. ప్రపంచానికి ఇంతకంటే పెద్ద ప్రమాదకరమైన సమయాన్ని నేనెప్పుడు చూడలేదని ఆయన అన్నారు. అభిమానులు, అనుచరుల కేరింతల మధ్య ఆయన మూడో ప్రపంచయుద్దాన్ని ఆపుతానని ప్రకటించారు. తాను వ్లాదిమిర్ పుతిన్ తో మంచి సంబంధాలను కలిగి ఉన్నానని, రష్యా అధ్యక్షుడు తన మాటను వింటాడని, ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం చూపించేందుకు నాకు ఒక రోజు కన్నా ఎక్కువ సమయం పట్టదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
మన దేశాన్ని నాశనం చేయాలనుకునే, ద్వేషించే వ్యక్తలను నుంచి అమెరికాను రక్షించేందుకు ప్రజలు చారిత్రాత్మక పోరాటంలో ఉన్నారని ఆయన అన్నారు. అమెరికా ఓటర్లు చైనాను ప్రేమించే రాజకీయ నాయకులు, విదేశీ యుద్ధాలను ప్రేమించే వారితో, రెండు పార్టీల్లో ఉన్న కుటుంబ రాజకీయాలతో విసిగిపోయారని ట్రంప్ అన్నారు.