Purandeswari: జనసేన – బీజేపీ పొత్తు.. మరోసారి క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Purandeswari: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఉండగా.. తాజాగా ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీ-జనసేన కలిసి ముందుకు వెళ్తాయని ప్రకటించారు.. ఇదే సమయంలో.. బీజేపీ మాతో కలిసి వస్తుందా? లేదా? అనే విషయం వారే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే స్పందించిన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. మరోసారి ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. పొత్తులు అనేవి ఎన్నికలకు నెల ముందు నిర్మించబడతాయి.. ఆ విషయాన్ని కేంద్ర పెద్దలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు.
Read Also: Mohammed Shami Bail: భారత క్రికెటర్ మహ్మద్ షమీకి బెయిల్ మంజూరు!
Also Read
- Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
పవన్ కల్యాణ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో బీజేపీతో పొత్తులో ఉన్నాను అని చెప్పారు.. మేం జనసేన తో పొత్తులో ఉన్నాం అన్నారు పురంధేశ్వరి.. అయితే, పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీతో వెళ్లాలి అనే విషయం కేంద్రంతో చర్చిస్తా అన్నారు.. ఆ విషయం పార్టీ పెద్దలు చూసుకుంటారని తెలిపారు. కానీ, రాష్ట్రంలో ఏం జరిగిన బీజేపీకి ఆపాదించడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సమర్థనీయం కాదన్నారు.. పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. చీప్ లిక్కర్ ద్వారా డబ్బు సంపాదించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం సమంజసం కాదన్నారు. ఇక, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి అనే ఆలోచన బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్నారు. సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లు తమదే అంటున్నారు. కానీ, ఆ బిల్లును అమలు చేయడానికి బీజేపీ కృషి చేస్తుందని తెలిపారు. పేదలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలను మోడీ ప్రభుత్వం చేపడుతుందని వెల్లడించారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి.
తాజావార్తలు
-
Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!