Minister Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఇలా ఎవ్వరినీ వదలకుండా అందరిపై విరుచుకుపడ్డారు మంత్రి అంబటి రాంబాబు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు అరెస్టు అక్రమమని టీడీపీ నాయకులు, పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నారని, భువనేశ్వరి కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు.. చంద్రబాబు అరెస్ట్ చాలా సక్రమం.. చట్టబద్ధమైనదని అన్నారు. అరెస్టు చేసిన తర్వాత న్యాయస్థానం ముందు ప్రవేశపెడతారని, కక్ష సాధింపు చేస్తే రిమాండ్ రిజెక్ట్ చేసేవారని వివరించారు. చంద్రబాబు తరఫున ఢిల్లీ నుంచి వచ్చే పెద్ద పెద్ద అడ్వకేట్లు సుప్రీంకోర్టు హైకోర్టుల్లో వాదిస్తున్నారు.. ప్రాథమిక ఆధారాలు ఈ కేసులో ఉన్నాయని రిమాండ్ కు పంపారని తెలిపారు. అయినా రిమాండ్ సక్రమమే అన్నమాట వినిపించిందని వివరించారు. ఇది అక్రమ అరెస్టు ఎలా అవుతుంది పవన్ కళ్యాణ్ ను, టీడీపి నేతలను నిలదీశారు అంబటి.
భువనేశ్వరికి చంద్రబాబు అరెస్ట్ అక్రమంగా కనిపించడం సహజం.. భర్త అవినీతిపరుడైనా మంచివాడిగానే భావిస్తుందని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. కానీ, ప్రజలందరూ అలా అనుకోవాలని కోరుకోవటం కరెక్ట్ కాదు అని హితవుపలికారు. చంద్రబాబు అరెస్టు విని గుండె పగిలి చనిపోయారని భువనేశ్వరి చెబుతున్నారని విమర్శించారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు నాయుడు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారన్న ఆయన.. అబద్దాలు, అవినీతి గెలవాలని యాత్రలు చేస్తే మీకు ఉపయోగం ఉంటుందని సూచించారు. చంద్రబాబు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడ్డారని భువనేశ్వరి చెబుతున్నారు.. మరి ప్రజలు ఎందుకు చంద్రబాబును దారుణంగా తిరస్కరించారని ప్రశ్నించారు. లోకేష్ కు దొడ్డి దారిన మూడు పెదవులు కట్టబెట్టడం తప్పు కాదా? అన్న ఆయన.. మీరు సిద్ధపడితే సవాల్ చేస్తున్నాను.. మీకున్న ఆస్తులపై ఎంక్వయిరీ కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తే సిద్ధంగా ఉంటారా? అంటూ చాలెంజ్ చేశారు.
ఇక, చంద్రబాబు ఏనాడైనా ప్రజలకు నిజం చెప్పారా..? అని ప్రశ్నించారు అంబటి.. అన్ని సాక్ష్యాదారాలతో దొరికిపోయి.. ఏ కోర్టు నుండి బెయిల్ రాని పరిస్థితుల్లో ఫ్రస్టేషన్లో ఉన్న చంద్రబాబు, టీడీపీ నేతలు.. అదంతా సీఎం జగన్ పై తోసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు.. పురందేశ్వరికి భారతీయ జనతా పార్టీని బాగు చేయాలని ఆలోచన లేదన్నారు. లోకేష్ ను తీసుకెళ్లి అమిత్ షాతో కల్పించారని.. సమావేశం కోసం లోకేష్ ఏం చేశారో కిషన్ రెడ్డి క్లియర్ గా చెప్పారన్నారు. ఢిల్లీలో ఉండి లోకేష్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించిన మంత్రి.. వ్యవస్థలను ఉపయోగించుకుని చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేస్తున్నారని ఆరోపణలు చేయటం వాస్తవం కాదని కొట్టిపారేశారు.
ప్రభుత్వం లిక్కర్ స్కామ్ జరుగుతుందంటూ పేపర్ కథనాలపై.. కేంద్రం విచారణ చేయాలని కోరడం దారుణం అన్నారు అంబటి రాంబాబు.. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక్కకొత్త డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు.. గత ప్రభుత్వంలోనే అనుమతులు తెచ్చుకున్నాయని వివరించారు. ఇప్పుడు అమ్ముతున్న బ్రాండ్లన్నీ చంద్రబాబు హయాంలో విడుదలైనవేనని తెలిపారు. మద్యం విషయంలో గందరగోళం జరిగిందని అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పురంధేశ్వరి తన మరిదిని, మరిది కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పురంధేశ్వరి ఒక మీడియేటర్ గా వ్యవహరిస్తోందని విమర్శించారు. నారావారిపల్లికి మధ్య రాయబారాలు నడిపే కార్యక్రమాలు చేస్తుందని దుయ్యబట్టారు. అక్రమ అరెస్టులు చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.. ఇక, నిర్వాసితులకు పునరావాసం కల్పించే వరకు పోలవరం ప్రాజెక్టులోకి నీళ్లు వదలమని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు మంత్రి అంబటి రాంబాబు.