విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై కోలువుదీరిన కనకదుర్గ అమ్మవారి నేడు బాలాత్రిపురసుందరి అవతారంలో దర్శనమిస్తుంది. అయితే, అమ్మవారిని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. అన్నిటికి మూలమైన శక్తి స్వరూపిణి అమ్మవారు.. సర్వేజన సుఖినోభవంతు అంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలి అని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకున్నాను అని ఆమె తెలిపారు.
Read Also: Road Accident: మహారాష్ట్రలో ఘోరం.. మినీ బస్సును ఢీకొన్న కంటైనర్ 12 మంది మృతి.. 23 మందికి గాయాలు
ఇక, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం జీవితం అందరికీ స్పూర్తి.. ప్రస్తుతం కులాలు మతాలను రాజకీయాల కోసం విభజిస్తున్న పరిస్థితి నెలకొంది అని ఆమె అన్నారు. కుల మతాలకు అతీతంగా కలాం జీవితం నడిచారు.. పేద కుటుంబంలో పుట్టిన ఆయన స్వయం కృషితో దేశం గర్వించే స్థాయికి ఎదిగారు.. కలాం అనే కంటే మిస్సైల్ మేన్ అని పిలిస్తేనే బాగుంటుంది అని పురంధేశ్వరి అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలోనే కలాం రాష్ట్రపతి అయ్యారు అని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. ఉన్నత పదవిలో ఉన్నా సామాన్యుడిగా ఆయన ప్రవర్తన ఉండేది అని ఆమె అన్నారు.