Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబును కాపాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పురంధేశ్వరి బీజేపీ నేతగా కంటే చంద్రబాబుకు మేలు చేసేలా పని చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌ను కూలదోసే సమయంలో బాబుకు పురంధేశ్వరి సపోర్టు చేశారని పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు కోసం పురంధేశ్వరి బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారని తీవ్రంగా వ్యాఖ్యానించారు ఏపీలో బీజేపీలో బలం ఉందా లేదా అనే విషయం అందరికీ తెలుసన్నారు పేర్ని నాని. బీజేపీ టికెట్లను పురంధేశ్వరి ఎవరికి ఇప్పించారో చూస్తూనే ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీలో ఒరిజినల్ నాయకులను ఇంట్లో కూర్చోబెట్టారని.. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారంతా టీడీపీ నేతలనేనని అన్నారు. దేశంలో దొంగలు పడ్డారో లేదో కానీ.. బీజేపీ మాత్రం టీడీపీ దొంగలు పడ్డారన్నారు. ఏపీలో బీజేపీకి ఓట్లు ఉన్నాయా లేదా అన్నది అందరికీ తెలుసన్నారు. అమిత్ షా దగ్గరకు చంద్రబాబును పురంధేశ్వరి తీసుకెళ్లారని పేర్ని నాని అన్నారు. మరిది కళ్లల్లో ఆనందం కోసం పోలీసు అధికారులపై పురంధేశ్వరి ఆరోపణలు చేశారని విమర్శించారు.
Read Also: CM YS Jagan: జూన్ 4న మళ్లీ అధికారంలోకి వస్తాం.. దానిపైనే మొదటి సంతకం!
చంద్రబాబుపై చట్ట పరమైన చర్యలు తీసుకున్న అధికారుల పేర్లతో ఈసీకి పురంధేశ్వరి లేఖ రాసి ఫిర్యాదు చేశారని పేర్ని నాని మండిపడ్డారు. 22 మంది నిజాయితీగల అధికారులపై ఫిర్యాదు చేస్తే ఈసీ ఎందుకు ప్రశ్నించలేదని ఆయన పేర్కొన్నారు. పేర్ని నాని మాట్లాడుతూ.. “వదిన పురంధేశ్వరి, మరిది చంద్ర బాబు కోసం ఇవన్నీ చేస్తున్నారు. వదిన, మరిది కళ్ళల్లో ఆనందం కోసం ప్రయత్నాలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ప్రశ్నిస్తున్నా. నిజాయితీ అధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఉంటే ఎలా ? ఇటువంటి లేఖలు రాస్తే సీఈవో పురంధేశ్వరిని ఎందుకు నిలదీయడం లేదు…ప్రశ్నించడం లేదు. ఎందుకు ముకేష్ కుమార్ మీనా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారుపురంధేశ్వరి బరితెగించి లేఖ రాస్తే చూస్తూ ఎలా ఉంటారు. ఏ హోదాలో బదిలీ చేసి… ఏ అధికారిని వెయ్యాలి లేఖలో ఎలా చెబుతారు ?” అని ప్రశ్నించారు.