BJP: ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్డీఏకు మెజార్టీ స్ధానాలు సాధిస్తుంది.. సర్వేలు ఇవే చెబుతున్నాయని తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ ఎన్నికల సహ ఇంఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరితో కలిసి.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అరుణ్ సింగ్.. ఎన్నికల రణ రంగంలో నామినేషన్లు దాఖలు చేసే సమయం .. క్షేత్రస్ధాయిలో మరింత కష్టించాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కంటే ఎక్కువ స్ధానాలు బీజేపీ సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి.. ఏపీలో కూడా ఎన్డీఏ మెజార్టీ స్ధానాలు సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయన్నారు.
Read Also: Nabha Natesh: హీరోయిన్‌ను డార్లింగన్న ప్రియదర్శి.. మాటలు జాగ్రత్త అంటూ నభా వార్నింగ్!
ఇక, ఎన్డీఏ సభలు విజయవంతం చేయడానికి బీజేపీ వైపు నుండి పెద్ద ప్రయత్నం చేద్దాం అని సూచించారు ఏపీ ఎన్నికల సహ ఇంఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్.. నామినేషన్లు దశ కనుక క్షణం తీరిక లేకుండా అహర్నిశలు పని చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికలతో ఏపీలో బీజేపీని బలోపేతం చేసుకునే విధంగా మని పనితం ఉండాలన్నారు. పొత్తులో కేటాయించిన సీట్లు మొత్తం గెలుచుకునే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు సిద్ధార్థ్ నాథ్ సింగ్.. మరోవైపు.. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ బీజేపీ అభ్యర్ధులుగా భావించి విజయానికి కృషి చేద్దాం అని సూచించారు. ఎన్డీఏ గెలుపునకు బీజేపీ పెద్దన్న పాత్ర పోషించింది అన్న విశ్వాసాన్ని కలిగించాలి.. ఎన్నికల సందర్భంగా జరిగే సంఘటనలపై అప్పటికప్పుడు స్పందించాలి.. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటే గెలుపు తథ్యం అని సూచించారు పురంధేశ్వరి.