Bomb Blast : కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం బాంబు కలకలం సృష్టించింది. మొదటి ప్లాట్‌ఫామ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఉంచిన నల్లటి సంచిలో ఉన్న నాటు బాంబు పేలడంతో ఒక వీధి కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఉదయం వేళ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్‌ఫామ్ పక్కన రైల్వే ట్రాక్‌పై ఉంచిన నల్లటి సంచిని ఒక వీధి కుక్క ఆహారంగా భావించి తినే…
RTA Raids: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లాల్లోని పలు కీలక ప్రాంతాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
RCB: ఐపీఎల్-2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) గెలుపు తర్వాత, నిర్వహించి కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. అయితే, జూన్ 04న బెంగళూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీనే బాధ్యత వహించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) చెప్పింది. ఈ ఘటనపై ట్రిబ్యునల్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
హైడ్రా పేరు చెప్పిబెదిరించిన ఇరువురిపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మిరియాల వేదాంతం, యెలిసెట్టి శోభన్ బాబు గండిపేట మండలం, నెక్నాంపూర్ విలేజ్‌లోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఓ ఇంటికి వెళ్లి బెదిరించినట్టు పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. ఈ నెల 23న మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నలుపు రంగు కారులో వచ్చిన ఈ ఇద్దరు ఇంటి ఆవరణలోకి వచ్చి పరిశీలిస్తుండగా.. ఎవరని అడిగితే తాము హైడ్రా నుంచి వచ్చామని బదులిచ్చారని…
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ అంశంపై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా విధానసౌధ భద్రతా విభాగం డీసీపీ ఎం.ఎన్. కరిబసవనగౌడ రాసిన లేఖ బయటపడింది. అందులో కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు తేలిసంది. జూన్ 4న, డీసీపీ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారు.
Gautam Gambhir: బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాటపై భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, విజయోత్సవాల కోసం రోడ్లపై జరిపే ర్యాలీల అవసరం లేదని తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. నాకు ఎప్పుడూ వీధి ర్యాలీలపై నమ్మకం లేదని.. ఇలా జరగడం దురదృష్టకరం అని అన్నారు. 11 ప్రాణాలు పోవడం అంటే ఊహించలేనిది. విజయం ఎంత…
ఆర్సీబీ విజయోత్సవాల వేళ బెంగళూరులో సంభవించిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. ఈ ఘటనపై సుమోటో కేసు నమోదు చేయాలని బెంగళూరు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తొక్కిసలాట ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నిందితులుగా చేర్చారు. మరోవైపు మెజిస్టేరియల్ విచారణలో భాగంగా ఇప్పటికే వారికి అధికారులు నోటీసులను జారీ చేశారు.
తొక్కిసలాట ఘటనపై సుమోటో కేసు నమోదు చేయాలని బెంగళూరు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. మంగళవారం స్టేటస్ రిపోర్టును పరిశీలన చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తొక్కిస్లాట ఘటనపై బెంగళూరు హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఘటనపై ప్రభుత్వానికి సంబంధించి వివరాలను అడ్వొకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. రెండున్నర లక్షల మంది స్టేడియం వద్ద చేరుకున్నారని.. తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందారని.. 56 మంది గాయాలు, 15…
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించారు. ఇండియా టుడేతో ఆయన మాట్లాడారు. జనసమూహాన్ని నిర్వహించడానికి 5000 మంది సిబ్బందిని నియమించినట్లు స్పష్టం చేశారు. కానీ మరణాల సంఖ్యను మాత్రం నిర్ధారించలేదు. "నేను ఇంకా సంఖ్యలను నిర్ధారించలేను, నేను ఇప్పుడు స్టేడియంకు వెళ్తున్నాను. చాలా మంది భావోద్వేగ అభిమానులను చేరుకున్నారు. 5000 సిబ్బందిని మోహరించాం" అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఇండియా టుడేతో అన్నారు.
గంజాయి వ్యాపారులు, డ్రగ్ డీలర్లు, బ్లేడ్ బ్యాచ్లకు జగన్ను గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందేమో అని పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు. గంజాయి అమ్మడం, ఆడపిల్లలను వేధించడం నేరం కాదన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయన్నారు. తాజాగా జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. గతంలో మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టారన్నారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ప్రజలంటే జగన్ కి కోపం రోజురోజుకూ పెరిగిపోతోందని ఆరోపించారు.