Bomb Blast : జర్రుంటే రైలు పేలుతుండే..! బాంబు కొరికిన కుక్క.. బ్లాస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Blast : కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం బాంబు కలకలం సృష్టించింది. మొదటి ప్లాట్‌ఫామ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఉంచిన నల్లటి సంచిలో ఉన్న నాటు బాంబు పేలడంతో ఒక వీధి కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఉదయం వేళ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్‌ఫామ్ పక్కన రైల్వే ట్రాక్‌పై ఉంచిన నల్లటి సంచిని ఒక వీధి కుక్క ఆహారంగా భావించి తినే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ఆ సంచిలోని బాంబు భారీ శబ్దంతో పేలింది. ఈ పేలుడు ధాటికి ఆ కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. రైల్వే స్టేషన్‌లో హఠాత్తుగా భారీ శబ్దం రావడంతో అక్కడున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో వారు పరుగులు తీశారు. వెంటనే తేరుకున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు.
Rupee Falls: దారుణం.. రికార్డు కనిష్టానికి చేరిన రూపాయి విలువ.. డాలర్‌తో పోలిస్తే రూ.90 పైనే..!
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ప్రయాణికుల సమాచారంతో రంగంలోకి దిగిన మూడవ పట్టణ పోలీసులు, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాంబు పేలుడుపై కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తీవ్రత దృష్ట్యా, రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఇంకా ఏమైనా ప్రమాదకర వస్తువులు లేదా బాంబులు ఉన్నాయేమోనని పోలీసులు జాగీలాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆ ప్రాంతంలో మరో ఐదు నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ నాటు బాంబులను రైల్వే స్టేషన్‌లో ఎందుకు పెట్టారు, దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, రైల్వే స్టేషన్‌లో భద్రతను పర్యవేక్షిస్తున్నామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి