Gun Firing: నవి ముంబైలోని సంపాదలోని డిమార్ట్ సమీపంలో శుక్రవారం ఉదయం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి 5-6 రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయారు. ఘటనా స్థలంలో ఉన్న ప్రజలకు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో అక్కడున్న ప్రజల్లో భయాందోళన నెలకొనగా.. గాయపడిన వ్యక్తిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి నిలకడగా ఉందని…
New Year Celebrations: తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలు అత్యంత భారీగా జరిగాయి. ప్రజలంతా కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో డీజేలు, డ్యాన్స్‌లు, విందులతో సందడి చేశారు. అయితే, ఈ వేడుకల మధ్య కొన్ని అవాంఛిత ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. చెప్పినట్లుగానే.. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్లపై మందుబాబులు పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా మొత్తం…
Vietnam Hanoi: వియత్నాం రాజధాని హనోయిలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వియత్నాం పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ గురువారం ఈ ఘటనను ధృవీకరించింది. మూడు అంతస్తుల కేఫ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేఫ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉద్యోగులతో గొడవపడి, పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కక్షతోనే ఈ పని చేశానని నిందితుడు అంగీకరించాడని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం తర్వాత ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్…
టపాసుల దుకాణ దారులు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. అబిడ్స్ బొగ్గులకుంటలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైన క్రాకర్స్ దుకాణ ప్రాంతాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన క్రాకర్స్ దుకాణాన్ని ఆ పక్కనే ఆహుతి అయిన టిఫిన్ సెంటర్‌ను పరిశీలించి ప్రమాదానికి కారణాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు ఏవీ రంగనాథ్.
కొమురం భీం జిల్లా అటవీ శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వచ్చిన ఏనుగు మళ్లీ జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్ర నుండి ప్రాణహిత సరిహద్దు 30 కిలోమీటర్ల దూరంలో రెండు రోజుల క్రితం గుర్తించామని ఆయన తెలిపారు.
దేవరగట్టు కర్రల సమరంలో హింసను నియంత్రించేందుకు పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. అధికారులు రూపొందించిన ప్రణాళికలు అమలవ్వకపోవడం వల్ల ఈ సమరంలో 70 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా హోళగుంద మండలంలో ప్రతి సంవత్సరం దసరా రోజు అర్ధరాత్రి బన్ని ఉత్సవం జరగుతుంది. ఈ ఉత్సవంలో కర్రల సమరం జరిగి, ఇద్దరు…
వికారాబాద్ జిల్లా పరిగి నేషనల్ హైవే 163పై అక్రమ రవాణా చాలా కాలంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బోర్ డ్రిల్లింగ్ లారీల అక్రమ రవాణా, పక్క దేశాలకు జరిగే ఎగుమతులు రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని కోల్పోవడానికి దారితీస్తున్నాయి. ఈ అక్రమ దందా యధేచ్ఛగా కొనసాగుతుండటం ప్రజల మనస్సులో ఆందోళన కలిగిస్తోంది. పరిగి ప్రాంతంలో బోర్ డ్రిల్లింగ్ లారీల అక్రమ రవాణా జరగడం అధికారికంగా నిర్ధారితమైంది. ఇటీవల, పోలీసులు వాహనాల తనిఖీల్లో అవాంఛనీయంగా పట్టుబడిన బోర్ బండి…
TG High Court Serious: వీధికుక్కల దాడులపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అమాయలకుపై కుక్కల దాడులు, వాటి నియంత్రణ చర్యలపై సమావేశాలు, సూచనలతో సరిపెట్టకుండా సమగ్ర కార్యాచరణ అవసరమని తేల్చిచెప్పింది.