Murali Mohan : హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో, అత్యవసర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో స్పందించే వ్యవస్థ అవసరం స్పష్టమవుతోంది. ఇటీవల పాతబస్తీలో జరిగిన విషాద అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఈ విషయంలో తీవ్ర ఆవశ్యకతను ముందుకు తెచ్చింది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నగరానికి ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రావడం గణనీయమైన పరిణామంగా మారింది. ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ మాట్లాడుతూ నగరం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇటువంటి ఆధునిక…
బెట్టింగ్ యాప్స్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ అన్నారు. బెట్టింగ్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్‌ల వల్ల వేల మంది చనిపోయారని గుర్తు చేశారు. లక్షలు, కోట్లు అప్పులు చేస్తూ.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలను అడ్డుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిందని తెలిపారు.
పంజాబ్ అమృత్‌సర్‌లో హైఅలర్ట్ కొనసాగుతోంది. ప్రభుత్వం మరోసారి ప్రజలకు కీలక సూచనలు చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలని.. దయచేసి ఇళ్లలో లైట్లు ఆపి, కిటికీలకు దూరంగా ఇంటి లోపల ఉండాలని సూచించింది. దయచేసి రోడ్డు, బాల్కనీ లేదా టెర్రస్‌పైకి వెళ్లవద్దని తెలిపింది. భయపడవద్దని.. సాధారణ కార్యకలాపాలను ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తామో తెలియజేస్తామని ప్రకటించింది. ఈ సమాచారాన్ని అమృత్‌సర్ డీసీ ఉదయం 4.39 గంటలకు జారీ చేసిన మార్గదర్శకంలో తెలిపింది.
No Firecrackers : భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు హైదరాబాద్ నగరంలోనూ ప్రతిధ్వనిస్తున్నాయి. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో, నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే నగరంలో బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. Bangladesh: బంగ్లాదేశ్‌కు షాక్.. కేంద్రం కీలక నిర్ణయం..! సరిహద్దుల్లోని పరిస్థితులు ఆందోళనకరంగా…
CM Revanth Reddy: హైదరాబాద్ లోని బుద్ధ భవన్ సెకండ్ బ్లాక్ భవనంలో ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభలో పాల్గొని, హైడ్రా ఏర్పాటు పట్ల తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో హైడ్రాను ఏర్పాటు చేసిందని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఇది కీలకమైన అడుగు అని ఆయన అన్నారు. ఈ సందర్బంగా…
HYDRA : భారతదేశంలో అనేక మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల అట్టడుగు లోతు కల్పించేవి వంటి సమస్యలపై దృష్టి సారిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ క్రమంలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి అమలులోకి తీసుకురావడమనే నిర్ణయం తీసుకుంది. నేటి నుంచే ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నగరంలోని బుద్ధభవన్ పక్కనే నిర్మితమైన ఈ హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్…
Mock Drill: హైదరాబాద్ నగరంలోని ఓఆర్ఆర్ పరిధిలో కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఈ మేరకు సీపీ ఆనంద్ ప్రజలకు డ్రిల్ సమయంలో ఏం జరగబోతుంది? ఆ సమయంలో ఎలా ఉండాలని తాజాగా సూచించారు. ఇందులో భాగంగా అయన మాట్లాడుతూ.. 55 ఏళ్లనాటి వార్ సైరన్ ను వాడుతున్నామని, అలాగే సైరన్ మోగిన సమయంలో ఏమి చెయ్యాలి అనే దానిమీద అవగణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. Read Also: Pakistan: భారత్‌పై యుద్ధానికి…
పౌర రక్షణ బాధ్యతగా తెలంగాణ రాష్ట్ర పరిపాలన శత్రు దాడిలో ప్రాణ, ఆస్తినష్టం తగ్గించేందుకు ప్రజలను సిద్ధం చేస్తోంది. పౌర రక్షణ చట్టం 1968 ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పుడూ పౌర రక్షణ నిర్వహిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్లో స్పందించేందుకు సివిల్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంటాయి. పౌరులకు అవగాహన కల్పించి శిక్షణ ఇస్తాయి. పౌరుల ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు పని చేస్తాయి. శత్రు దాడి సమయంలో ప్రజల ధైర్యాన్ని పెంచేందుకు తోడ్పడతాయి. ఈ మేరకు…
Civil Mock Drill : పహల్గామ్ ఘటనతో ఒక్కసారిగా పరిస్థితిలు మారిపోయాయి.. అయితే.. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. అయితే.. ఈ క్రమంలోనే సివిల్ మాక్ డ్రిల్ చేపట్టాలని సూచించింది. రేపు జరగబోయే మాక్ డ్రిల్‌లో అనుసరించాల్సిన దశలు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ డ్రిల్ ముఖ్య ఉద్దేశ్యం ప్రజలను అప్రమత్తం చేయడం, విపత్కర పరిస్థితుల్లో స్పందించే విధానంపై శిక్షణ ఇవ్వడం , సంబంధిత…
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని హోంమంత్రి తానేటి అనిత తక్షణమే స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌తో ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితిపై సమాచారం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.