Gautam Gambhir: బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాటపై భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, విజయోత్సవాల కోసం రోడ్లపై జరిపే ర్యాలీల అవసరం లేదని తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. నాకు ఎప్పుడూ వీధి ర్యాలీలపై నమ్మకం లేదని.. ఇలా జరగడం దురదృష్టకరం అని అన్నారు. 11 ప్రాణాలు పోవడం అంటే ఊహించలేనిది. విజయం ఎంత ముఖ్యమో, మనిషి జీవితం అంతకంటే ముఖ్యమైందని నేను ఎప్పుడూ చెబుతుంటానని గంభీర్ ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
Read Also: Kailash Vijayvargiya: “చిన్న దుస్తులు వేసుకున్న అమ్మాయిలు నచ్చరు” మళ్లీ వివాదాల్లో బీజేపీ మంత్రి..!
ఇలాంటి వేడుకలు అవసరమైన భద్రతా ఏర్పాట్లు లేకుండా జరిపితే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే.. ఒక మనిషి ప్రాణం కూడా పోతే అది చాలా పెద్ద నష్టమే. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గంభీర్ మాట్లాడారు. ఇలాంటి విజయాలు జరుపుకోవడం తప్పేమీ కాదని, కానీ ప్రజల ప్రాణాలకంటే ఏదీ ముఖ్యమైనదికాదని స్పష్టం చేశారు. ఫ్యాన్స్ ఉత్సాహపడటం సహజం. కానీ, ఆ ఉత్సాహం నియంత్రణ కోల్పోతే విపత్తులకు దారితీస్తుంది. భద్రతకు సంబంధించిన సన్నద్ధత లేకపోతే ర్యాలీలు నిర్వహించకూడదని గంభీర్ అన్నారు.
Read Also: Physical Harassment : వికారాబాద్‌లో దారుణం.. మైనర్ బాలికపై లైంగిక దాడి..!
ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని కర్ణాటక క్రికెట్ సంఘం (KSCA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఈవెంట్‌కు అనూహ్యంగా లక్షలమంది అభిమానులు తరలివచ్చారు. దీనివల్ల ఏర్పడ్డ అపసవ్య పరిస్థితుల్లో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటన భారత దేశంలో జరిపే భారీ వేడుకల నిర్వహణపై అనేక ప్రశ్నలు రేపింది.