Hydra: హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడ్డ ఇద్దరిపై కేసు.. నంబర్ షేర్ చేసిన హైడ్రా..
- హైడ్రా పేరు చెప్పిబెదిరించిన ఇరువురిపై కేసు
- అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఓ ఇంటికి వెళ్లి బెదిరింపు
- నలుపు రంగు కారులో వచ్చిన ఈ ఇద్దరు
- ఇంటి ఆవరణలోకి వచ్చి పరిశీలించిన వైనం
- హైడ్రా అధికారుల మంటూ చెప్పిన దుండగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైడ్రా పేరు చెప్పిబెదిరించిన ఇరువురిపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మిరియాల వేదాంతం, యెలిసెట్టి శోభన్ బాబు గండిపేట మండలం, నెక్నాంపూర్ విలేజ్‌లోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఓ ఇంటికి వెళ్లి బెదిరించినట్టు పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. ఈ నెల 23న మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నలుపు రంగు కారులో వచ్చిన ఈ ఇద్దరు ఇంటి ఆవరణలోకి వచ్చి పరిశీలిస్తుండగా.. ఎవరని అడిగితే తాము హైడ్రా నుంచి వచ్చామని బదులిచ్చారని ఆ ఇంటి వద్ద పని చేస్తున్న గుంతకల్ మల్లికార్జున్ తెలిపారు.
READ MORE: CM Chandrababu: గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నా.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోవడమే..
Also Read
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
ఎందుకు వచ్చారని అడిగితే ఈ ఇంటిని కూల్చేస్తామని.. ఇందుకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నామని చెప్పారన్నారు. ఇంటి యజమానితో మాట్లాడాలని సూచించగా.. చల్లగా జారకున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మల్లికార్జున్ పేర్కొన్నారు. నిందితులు మిరియాల వేదాంతం(22) కారు డ్రైవర్ కాగా.. కరీంనగర్ జిల్లాకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. అల్కాపురి టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్నాడు. మరో వ్యక్తి యెలిసెట్టి శోభన్‌బాబు ఆర్టీసీలో పని చేసి రిటైర్ అయ్యారు. ఈయన మణికొండలోని పుప్పాలగూడ, ఎస్టీమ్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నాడు. ఆ ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
READ MORE: Revanth Reddy: రామ్‌చరణ్ చిన్నప్పటి నుంచే తెలుసు.. విజయ్ దేవరకొండది మా పక్క ఊరే..
హైడ్రా పేరుతో బెదిరిస్తే జైలు శిక్ష ఖాయం
హైడ్రా పేరు చెప్పి ఎవరైనా మోసాలకు, బెదిరింపులకు పాల్పడితే వెంటనే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని హైడ్రా గురువారం ఒక ప్రకటనలో కోరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని.. నేరుగా తమకు ఆ సమాచారం ఇచ్చినా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. హైడ్రా ఉద్యోగులు విచారణ చేపడితే.. పూర్తి వివరాలు అందజేస్తారని.. ఒక వేళ హైడ్రా ఉద్యోగులు కూడా మోసాలకు పాల్పడి.. హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా స్పష్టం చేసింది. ఎవరైనా మోసాలకు పాల్పడితే.. 8712406899 నంబరుకు ఫోను చేసి సమాచారాన్ని వాట్సాప్‌లో అందజేయడంతో పాటు.. వారి ఫొటోలు కూడా పంపించాలని కోరింది.
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!