వైసీపీ ఎప్పుడూ ప్రజలపై బాధ్యతాయుతంగా వ్యవహరించిందని.. జగన్ ప్రజలే అన్నీ అని నమ్మారని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజాగ్రహాన్ని ఇప్పటికైనా గమనించండన్నారు. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడ్డగోలుగా వెళ్తే ప్రజలు సమాధానం చెబుతారని.. ప్రజల అభీష్టం మేరకే పార్టీలకు మనుగడ సాగించగలవని చెప్పారు.
HYDRA : హైదరాబాద్ నగరంలో హైడ్రా బలగాలు మరోసారి భారీగా కూల్చివేతల దాడులు చేపట్టాయి. ఈ సారి గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకొని మినీ హాల్, ఫుడ్ కోర్ట్స్‌తో పాటు అనేక అనుమతులు లేని నిర్మాణాలను తొలగించారు. ఉదయం నుంచే మూడు భారీ హిటాచ్ బుల్డోజర్ల సహాయంతో కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసులు ఘటనా స్థలంలో బందోబస్తును ఏర్పాటు చేసి, ఎవరికీ లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. ఈ కూల్చివేతలు ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా…
BRS : వరంగల్‌లోఈ సాయంత్రం జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకి తరలి వెళ్తున్న ప్రైవేటు వాహనాలని పలు చోట్ల రోడ్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు నిలిపివేస్తునారు.. అధికారుల వైఖరి నిరసిస్తూ బి ఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గంలో బస్సుల నిలిపివేత ఎక్కువగా జరిగింది. ప్రైవేటు స్కూల్ బస్సులు అదేవిధంగా ప్రైవేటు యాజమాన్యం లోని బస్సులను యాజమాన్యాలకి ఆర్టీవో కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లి వెళ్ళాయి . స్కూల్ బస్సులు కార్యక్రమానికి…
బాలనగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి వాహన దారుడు మృతి చెందాడు. చలానా రాసేందుకు రన్నింగ్ లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఆపే క్రమంలో ద్విచక్రవాహన దారుడు అదుపుతప్పి కింద పడ్డ పడ్డాడు. ఆ వ్యక్తి తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అని రోడ్డుపై ఇతర వాహన దారులు ధర్నాకు దిగారు. దీంతో బాల నగర్ నుంచి నర్సాపూర్…
Viral Video: గుజరాత్‌లో జరిగిన ఓ సంఘటన ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతూ, సామాన్యుల ఆగ్రహానికి ఉదాహరణగా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో లంచం తీసుకుంటున్నాడన్న ఆరోపణలపై ఓ ప్రభుత్వ అధికారిపై అక్కడి ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును చూడవచ్చు. అందిన సమాచారం మేరకు, ఆందోళనకారులు ప్లకార్డులు పట్టుకుని ఆ అధికారిది పని చేసే కార్యాలయానికి చేరుకున్నారు. అధికారిని కళ్లెదుట కూర్చోబెట్టి,…