వైసీపీ ఎప్పుడూ ప్రజలపై బాధ్యతాయుతంగా వ్యవహరించిందని.. జగన్ ప్రజలే అన్నీ అని నమ్మారని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజాగ్రహాన్ని ఇప్పటికైనా గమనించండన్నారు. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడ్డగోలుగా వెళ్తే ప్రజలు సమాధానం చెబుతారని.. ప్రజల అభీష్టం మేరకే పార్టీలకు మనుగడ సాగించగలవని చెప్పారు.. తాము ఇంత దెబ్బ తగిలినా నిలబడ్డామంటే ప్రజలు తమ వెంట ఉండబట్టే అన్నారు. తమ మీద రాజకీయం ఎంత కోపం ఉన్నా ప్రజల మీద చూపించకండని తెలిపారు. తమ నిరసన ప్రదర్శనలు అడ్డుకుంటే అడ్డుకున్నారు.. చంద్రబాబు ప్రజలను మోసం చేసిన రోజు కాబట్టి ఇవాళే వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించామని వెల్లడించారు.. తమకు వ్యతిరేకంగా వాళ్ళు కూడా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. ఎవరి కార్యక్రమాలకు ఎలాంటి స్పందన వచ్చిందనేది అర్థం అవుతుందన్నారు.
READ MORE: Fish Prasadam: హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?
మీరు కూడా ఏవో పండుగలు చేస్తామంటున్నారని.. అన్నీ చేయండి.. ప్రజలు ఏం చెబుతారనేది చూద్దాం అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. “మీరు ఎక్కడి వెళ్ళి ఏ కార్యక్రమం చేసినా ప్రజలే మీకు సమాధానం చెబుతారు.. మీరు ఎందుకు చేసుకోలేకపోతున్నారు.. మీరు విజయోత్సవాలు ఎందుకు జరపలేకపోతున్నారు.. వైసీపీ ప్రశ్నించకపోతే వాళ్లకు బాగుంటుంది. ప్రభుత్వం ఎంత సక్సెస్ అనేది వాళ్ళు చేసే పనులను బట్టే అర్థం అవుతుంది.. రోజురోజుకు పరిపాలన దిగజారిపోతోంది.. ఇంటి దగ్గరకే బెల్ట్ షాపుల్లో మద్యం డోర్ డెలివరీ అవుతుంది.. మద్యం ప్రియులు కూడా క్వాలిటీ విషయంలో సంతోషంగా లేరు..” అని సజ్జల వ్యాఖ్యానించారు.