HYDRA : మరోసారి హైడ్రా భారీ కూల్చేతలు.. ఈ సారి గచ్చిబౌలిలో
- నగరంలో మరొకసారి హైడ్రా కూల్చివేతలు
- గచ్చిబౌలి లోని సంధ్య కన్వర్షన్ కూల్చివేత
- ఉదయం నుంచి మూడు భారీ హిటాచ్‌లతో కూల్చివేతలు
- పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA : హైదరాబాద్ నగరంలో హైడ్రా బలగాలు మరోసారి భారీగా కూల్చివేతల దాడులు చేపట్టాయి. ఈ సారి గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకొని మినీ హాల్, ఫుడ్ కోర్ట్స్‌తో పాటు అనేక అనుమతులు లేని నిర్మాణాలను తొలగించారు. ఉదయం నుంచే మూడు భారీ హిటాచ్ బుల్డోజర్ల సహాయంతో కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసులు ఘటనా స్థలంలో బందోబస్తును ఏర్పాటు చేసి, ఎవరికీ లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. ఈ కూల్చివేతలు ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ పరిధిలో నిర్వహించబడ్డాయి. సంబంధిత లేఅవుట్‌కు ప్రభుత్వ అనుమతులు లేకుండానే రోడ్లు, పార్కులు వంటి ఉమ్మడి భూములపై ఆక్రమణలు జరిగాయని తెలుస్తోంది. రోడ్లను ఆక్రమించి నిర్మించిన గదులు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు వంటి కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించారు.
Viral : “ఇదేం టేస్ట్ రా బాబు” అనిపించేలా ఉంది కదా ఈ ఐస్‌క్రీమ్ ఫ్రైస్ కాంబో..!
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా పలువురు ప్లాట్ యజమానులు తమ స్థలాలు కనబడకుండా అక్రమ నిర్మాణాలు చేసినట్టు ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా నిర్మించిన వంటగదులు, రెస్ట్‌రూములు, మినీ హాల్ వంటి నిర్మాణాలన్నీ హైడ్రా అధికారుల పర్యవేక్షణలో కూల్చివేశారు. అంతేకాకుండా, జీ+2 అంతస్థుల్లో నిర్మించిన మూడు ఐరన్ షెడ్లు కూడా తొలగించబడ్డాయి. అదనంగా లేఅవుట్‌ను ఆక్రమించి వేసిన రేకుల ఫెన్సింగ్‌ను కూడా అధికారులు తొలగించారు. నగర శ్రేయస్సు కోసం, భవిష్యత్తులో ఇటువంటి అక్రమ నిర్మాణాలకు తావు లేకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. శాసనానుగుణంగా మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Viral : “ఇదేం టేస్ట్ రా బాబు” అనిపించేలా ఉంది కదా ఈ ఐస్‌క్రీమ్ ఫ్రైస్ కాంబో..!
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!